Begin typing your search above and press return to search.

పాయకరావుపేట టు కొవ్వూరు.. అనిత మార్పు

By:  Tupaki Desk   |   14 March 2019 7:48 AM GMT
పాయకరావుపేట టు కొవ్వూరు.. అనిత మార్పు
X
ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమరం మోగడంతో టికెట్ల కేటాయింపులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా పాయకరావుపేట సిట్టింగ్ ఎమ్మెల్యే వంగలపూడి అనిత సీటును టీడీపీ అధినేత మార్చేశారు. ఆమెపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్న దరిమిలా పశ్చిమ గోదావరి జిల్లాలోని కొవ్వూరు అసెంబ్లీ సీటును ఆమెకు ఇచ్చారు.

తాజాగా అనిత ఇన్నాళ్లు ప్రాతినిధ్యం వహించిన పాయకరావుపేట సీటును టీడీపీ నుంచి బంగారయ్యకు ఇచ్చారు. ఈ రెండూ కూడా ఎస్సీ నియోజకవర్గ సీట్లే కావడం గమనార్హం. పాయకరావుపేటలో ఇప్పటికే అనితకు టికెట్ ఇవ్వవద్దని రెండు వర్గాలు కొట్లాడుకుంటున్నాయి. ఒకరు అనితకు టికెట్ ఇవ్వాలని.. మరొకరు ఇవ్వవద్దని కోరుతున్నారు. దీంతో ఎట్టకేలకు ఈ వివాదాలను పరిష్కరించాలని టీడీపీ అధినేత చంద్రబాబు.. అనితను పాయకరావుపేట నుంచి కొవ్వూరుకు సీటును మార్చారు.

ప్రస్తుతం కొవ్వూరు ఎమ్మెల్యేగా .. ఎక్సైజ్ మినిస్టర్ కేఎస్ జవహర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈయన ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న దృష్ట్యా తిరువూరు టికెట్ ఇచ్చారు.

ఇక గుంటూరు జిల్లా సత్తనపల్లి నియోజకవర్గాన్ని తిరిగి అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్న స్పీకర్ , సిట్టింగ్ ఎమ్మెల్యే కోడెల శివప్రసాద్ కే చంద్రబాబు కేటాయించారు. నర్సారావుపేట సిట్టింగ్ ఎంపీ రాయపాటి సాంబశివరావు ను తిరిగి అదే స్థానం నుంచి టీడీపీ ఎంపీగా ఖాయం చేశారు. ఇక తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు కూడా అదే స్థానం నుంచి మరోసారి అవకాశం కల్పించారు.

ఒంగోలు లోక్ సభకు శిద్ధా రాఘవారావుకు, విశాఖ జిల్లా మాడుగుల టికెట్ రామానాయుడికి చంద్రబాబు కేటాయించారు. కూకలూరు టికెట్ జయమంగళ వెంకటరమణకు ఖరారైంది. చింతలపూడి నుంచి కర్రా రాజారావు పేరు ఖరారైంది. కనిగిరి నుంచి కదిరి బాబూరావు పేరు ఖరారు అయినట్లుగా సమాచారం. దర్శి నుంచి ఉగ్రనరసింహారెడ్డి ఆసక్తి చూపలేదు.