Begin typing your search above and press return to search.
తెలంగాణలో రోడ్డెక్కిన బస్సులు...ఎవరైనా ఈ రూల్స్ పాటించాల్సిందే !
By: Tupaki Desk | 19 May 2020 7:00 AM GMTతెలంగాణ రాష్ట్రంలో ఒక్క హైదరాబాద్ నగరం మినహా మిగిలిన అన్ని ప్రాంతాలలో ఆర్టీసీ బస్సులు రోడ్డెక్కాయి. మార్చి 22 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిలిచిపోయిన బస్సులు దాదాపు రెండు నెలల తర్వాత మళ్లీ సేవలు ప్రారంభించాయి. రాష్ట్రవ్యాప్తంగా 6 వేల బస్సులు నడిపిస్తున్నామని రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ తెలిపింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ చార్జీలు పెంచుతారనే ఊహాగానాలు వినిపించినా... గత ఛార్జీలనే ప్రయాణికుల నుంచి తీసుకుంటామని సంస్థ వెల్లడించింది.
ముఖ్యంగా ఈ బస్సుల్లో భౌతిక దూరం పాటించడానికి వీలుగా బస్సులో సగం సీట్లలో కూర్చోడానికే ప్రయాణికులకు అనుమతి ఇవ్వాలని ఆర్టీసీ ప్రతిపాదించింది. ఉదయం 6 గంటల నుంచి బస్సుల ట్రిప్పులు ప్రారంభమవుతాయి. రాత్రి 7 గంటల లోపు సదరు డిపోకే చేరుకోవాలి. రాత్రి 7 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా కర్ఫ్యూ ఉన్న సంగతి తెలిసిందే. గంట అటు ఇటు అయితే ఓకే.. కానీ అంతకన్నా ఎక్కువ సమయం అయితే మాత్రం అనుమతించబోమని సీఎం కేసీఆర్ సోమవారం రోజున ప్రెస్ మీట్‌లో కుండబద్దలు కొట్టారు.
అలాగే, జిల్లాల నుంచి హైదరాబాద్ వెళ్లే బస్సులు ఎంజీబీఎస్ వెళ్లవు. కానీ జూబ్లీ బస్ స్టేషన్ కు వెళ్లనున్నాయి. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ బస్సులు.. జేబీఎస్ వరకే అలో చేస్తారు. వరంగల్ బస్సులు ఉప్పల్, నల్గొండ బస్సులను హయత్ నగర్ నుంచి నడిపిస్తారు. మహబూబ్ నగర్ నుంచి వచ్చేవి ఆరాంఘర్, సంగారెడ్డి నుంచి వచ్చేవి బీహెచ్ఈఎల్ వరకు మాత్రమే పర్మిట్ చేస్తారు. ఆయా ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఆటోలు, ట్యాక్సీలలో తమ గమ్యస్థానాలకు చేరుకోవాల్సి ఉంటుంది. హైదరాబాద్‌లో సిటీ బస్సులను కూడా అనుమతించడం లేని విషయం తెలిసిందే. అంతరాష్ట్ర బస్సులు నడిచేందుకు అనుమతి ఇవ్వలేదు.
ఈ మహమ్మారి దృష్ట్యా అన్ని డిపోల్లోని బస్సులను శానిటైజ్ చేశారు. బస్సు ప్రతీ ట్రిప్పు తర్వాత డిపోకి వెళ్లి, అక్కడ శానిటైజ్ చేపించుకొని.. మరో ట్రిప్పు వెళ్లనుంది. అలాగే, బస్సు ఎక్కేముందు ప్రయాణికులకు థర్మల్ స్కీనింగ్ చేస్తారు. అలాగే మాస్క్ వేసుకుంటేనే బస్సులోకి అనుమతిస్తారు. మాస్క్ లేకపోతే బస్సు ఎక్కనివ్వరు, డ్రైవర్, కండక్టర్ కూడా విధిగా మాస్క్ ధరిస్తారు.