Begin typing your search above and press return to search.

టీమిండియా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ షాక్!

By:  Tupaki Desk   |   25 July 2018 1:28 PM GMT
టీమిండియా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ షాక్!
X
క్రికెట‌ర్లు విదేశీ ప‌ర్య‌ట‌న‌ల‌కు వెళ్లిన‌పుడు త‌మ‌తో పాటు గ‌ర్ల్ ఫ్రెండ్స్ లేదా భార్య‌ల‌ను తీసుకెళ్ల‌డం ష‌రా మామూలే. స‌ద‌రు సిరీస్ లో విరామం దొరికితే...త‌మ పార్ట్ న‌ర్స్ తో క‌లిసి ఎంచ‌క్కా షాపింగ్ లు - షికార్లు చేయ‌డం ....ఆ ఫొటోల‌ను త‌మ అభిమానుల‌తో సోషల్ మీడియాలో షేర్ చేయ‌డం....కామ‌న్. అదే త‌ర‌హాలో ప్ర‌స్తుతం ఇంగ్లండ్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా క్రికెట‌ర్లు కూడా త‌మ పార్ట్ న‌ర్స్ తో చెట్టాప‌ట్టాలేసుకుని తిరుగుతున్నారు. అయితే, టీమిండియా క్రికెట‌ర్ల‌కు బీసీసీఐ షాకిచ్చింది. తొలి మూడు టెస్టులు పూర్త‌య్యే వ‌ర‌కు భారత ఆటగాళ్లు తమ భార్య - ప్రియురాళ్ల (వాగ్స్‌)కు దూరంగా ఉండాలని బీసీసీఐ సూచించింది. నాలుగో టెస్టు ప్రారంభ‌మ‌య్యే వ‌ర‌కు భారత ఆటగాళ్లు సింగిల్ గానే ఉండాల‌ని హుకుం జారీ చేసింది. గ‌త అనుభ‌వాల దృష్ట్యా ...బీసీసీఐ ఈ క‌ఠిన నిర్ణ‌యం తీసుకున్న‌ట్లు తెలుస్తోంది.

ఇటీవ‌ల ఇంగ్లండ్ తో పూర్త‌యిన వన్డే సిరీస్ లో భార‌త్ ప‌రాజ‌యం పాలైన సంగ‌తి తెల‌సిందే. ప్ర‌స్తుతం టెస్టు సిరీస్ కు కొంత స‌మ‌యం ఉండ‌డంతో కోహ్లీ - ధావన్ - ఉమేశ్‌ మరికొంత మంది ఆటగాళ్లు తమ భార్యలతో కలిసి విహార యాత్రలకు వెళ్లారు. ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో కూడా షేర్ చేశారు. ఈ నేప‌థ్యంలోనే వారికి బీసీసీఐ షాకిచ్చింది. తొలి 3 టెస్టులు పూర్త‌య్యే వ‌ర‌కు తమ భార్య - ప్రియురాళ్ల (వాగ్స్‌)కు ఆట‌గాళ్లు దూరంగా ఉండాలని బీసీసీఐ ఆదేశించింది. ఆటగాళ్ల విఫ‌లం కావ‌డానికి వారి కుటుంబ సభ్యులే కారణమంటూ గ‌తంలో విమర్శలు వచ్చాయి. గ‌త ఇంగ్లండ్‌ పర్యటనలో కోహ్లీ...ఘోరంగా విఫ‌ల‌మ‌య్యాడు. దీంతోపాటు, ఇప్ప‌టికే వన్డే సిరీస్‌ కోల్పోయిన టీమిండియా....టెస్టు సిరీస్ లో ఓట‌మిపాలైతే తీవ్ర విమర్శలు వెల్లువెత్తే అవ‌కాశ‌ముంది. ఈ నేప‌థ్యంలోనే ముందు జాగ్రత్తగా బీసీసీఐ ఈ నిర్ణ‌యం తీసుకుంది.