Begin typing your search above and press return to search.
ఏపీలో ఈ ఏడాది అసెంబ్లీ సంగతి ఇంతే
By: Tupaki Desk | 16 Sep 2016 6:24 AM GMTఈ ఏడాదికి ఆంధ్రప్రదేశ్ శాసనసభ సమావేశాలు నవ్యాంధ్రప్రదేశ్ లో ఇక లేనట్లేనని చెప్తున్నారు. ఇటీవలే వర్షాకాల సమావేశాలు అయిపోయాయి కాబట్టి, ఇక మిగిలింది శీతాకాల సమావేశాలే. అయితే శీతాకాల సమావేశాల బదులుగా ఏకంగా బడ్జెట్ సమావేశాలు ఉండే అవకాశం కనిపిస్తోంది. ఇదే సమయంలో వైసీపీ లక్ష్యంగా టీడీపీ కొత్త అడుగులు వేస్తోందని ఆ పార్టీ అనుమానిస్తోంది. ఇదిలాఉండగా ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు చేసిన వ్యాఖ్యలు కూడా శీతాకాల సమావేశాలు ఉండవనేందుకు ఉదాహరణగా చెప్తున్నారు. సీఆర్ డీఏ కమిషనర్ - అడిషనల్ కమిషనర్ - అసెంబ్లీ - శాసనమండలి బిల్డింగ్ ప్లానింగ్ అధికారులతో వెలగపూడిలోని నూతన సచివాలయంలో రాష్ట్ర ఆర్థిక - శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు సమీక్ష నిర్వహించారు. ఈ డిసెంబర్ నెలాఖరు నాటికి అసెంబ్లీ - శాసనమండలి భవనాల నిర్మాణం పూర్తి చేయాలని సీఆర్ డిఏ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి - స్పీకర్ - మంత్రులు - అధికారుల చాంబర్స్ - సౌకర్యాలు - భద్రతపై చర్చించారు.
అసెంబ్లీ సమావేశాలు జనవరి నెలాఖరు లేదా ఫిబ్రవరి మొదటివారంలో సమావేశాలు జరుగుతాయని, దీన్ని దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ నెలాఖరుకు అసెంబ్లీ - శాసనమండలి భవనాల నిర్మాణ పనులు పూర్తి చేయాలని యనమల అధికారులకు అదేశాలిచ్చారు. ఈ నెల 19వ తేదీన శాసనసభ - శాసనమండలి భవనాలు నిర్మిస్తున్న ఎల్ అండ్ టీ కాంట్రాక్టర్లు - ప్లానర్లు - సీఆర్ డీఎ అధికారులు మున్సిపల్ శాఖామంత్రి పి.నారాయణతో నూతన సచివాలయంలోని ఆర్థిక మంత్రి చాంబర్ లో మరోసారి సమావేశం కావాలని నిర్ణయించారు. ప్రస్తుతం ఆ రెండు భవనాల నిర్మాణం అనుకున్నస్థాయిలో జరగడం లేదని - బిల్లులు మాత్రం అంచనాలకు మించి వస్తున్నాయని యనమల ప్రశ్నించినట్లు తెలిసింది. దీనిపై అధికారులు సమాధానం చెప్పలేకపోయారు. దీంతో అసహనం వ్యక్తం చేస్తూ పూర్తి వివరాలతో మరోసారి సమావేశానికి రావాలని ఆదేశించినట్లు సమాచారం. ఇప్పటి వరకూ జరిగిన పనులకు బిల్లులు కూడా సరిగా ఇవ్వలేదని - అంచనాలు పూర్తిగా పెంచేస్తున్నారని ఇదెలా సాధ్యమవుతుందని ప్రశ్నించినట్లు తెలిసింది. వర్షాలు - రోడ్లు సదుపాయం లేకపోవడం వంటి కారణాలతో పనుల్లో జాప్యం జరిగిందని - ఇక ముందు జరగదని - అసెంబ్లీ - శాసనమండలి భవనాల నిర్మాణాన్ని వెంటనే పూర్తి చేస్తామని అధికారులు చెప్పినట్లు సమాచారం
ఇదిలాఉండగా అసెంబ్లీ శీతాకాల సమావేశాలు జరపకుండా అధికార పక్షం వచ్చే ఫిబ్రవరిలో ఏకంగా బడ్జెట్ సమావేశాలను నిర్వహించాలని అనుకుంటున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ప్రతిపక్ష వైసీపీని ఇరుకున పెడతారని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల్లోగా ఇటీవల జరిగిన సమావేశాలకు సంబంధించి చర్యలు తీసుకోవాల్సిన ఎమ్మెల్యేలను గుర్తించి మిగిలిన కాలానికి వారినందరినీ సస్సెండ్ చేయటానికి అధికార టీడీపీ రంగం సిద్దం చేస్తోందని అంచనా వేస్తున్నారు. ఆపరేషన్ ఆకర్ష్ తో 67 సభ్యుల వైసీపీ బలం ప్రస్తుతానికి 47కి పడిపోయింది. సభ్యుల అనుచిత ప్రవర్తన పేరుతో కనీసం మరో 20 మంది సభ్యులపై సస్పెన్షన్ వేటు వేసేలా టీడీపీ ముందుకు సాగుతోందని వైసీపీ అనుమానిస్తోంది.