Begin typing your search above and press return to search.
అడ్డంగా నోబాల్స్.. అర్షదీప్ ను గాయంతోనే ఆడించారా?
By: Tupaki Desk | 6 Jan 2023 6:35 AM GMTటీమిండియా యువ పేసర్ అర్షదీప్ సింగ్ మరోసారి నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయాడు. శ్రీలంకతో రెండో టి20లో ఐదు నో బాల్స్ వేసిన అర్ష.. ఇప్పటివరకు ఆరెల్ల కెరీర్ లో 14 నో బాల్స్ వేశాడు. ఈ ఫార్మాట్ లో అత్యధిక నో బాల్స్ రికార్డు ఇతడిదే.దీంతోపాటు మ్యాచ్ కోల్పోవడానికి కూడా కారణమయ్యేన్ని పరుగులు (16) ఇచ్చాడని నిందలు ఎదుర్కొంటున్నాడు అర్షదీప్. అతడు మొత్తం హ్యాట్రిక్ సహా ఐదు నో బాల్స్ వేశాడు. అదనంగా 23 పరుగులు ఇచ్చాడు.
శ్రీలంక ఓపెనర్ కుశాల్ మెండిస్ ఇన్నింగ్స్ ఊపు అందుకోవడానికి అర్ష నోబాల్సే కారణమే వాదన కూడా ఉంది. దీంతోనే ''నో బాల్స్ వేయడం నేరం.. అది కూడా టి20ల్లో'' అనే తీవ్రమైన కామెంట్ ను కెప్టెన్ హార్డిక్ పాండ్యా చేశాడు. అంతకుముందు అర్ష 19వ ఓవర్లో నో బాల్ వేసినప్పుడు పాండ్యా తన ముఖాన్ని రెండు చేతుల్లో దాచుకున్నాడు. దీన్నిబట్టే అర్ష నో బాల్స్ మ్యాచ్ లో ఎంతటి సీన్ ను రేపాయో తెలిసిపోతుంది. ఆసియా కప్‌లో పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో అర్ష్‌దీప్‌క్యాచ్ జారవిడిచి సోషల్ మీడియా ట్రోలింగ్‌కు గురయ్యాడు.
ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్‌గా మారాడు. దీంతో అతడిపై కామెంట్లు, మీమ్స్ హల్‌చల్ చేస్తున్నాయి. మ్యాచ్ ఫిట్ నెస్ ఉందా?శ్రీలంకతో తొలి టి20కి మైదానంలోకి దిగిన జట్టులో ఆశ్చర్యకరంగా అర్షదీప్ లేడు. శివమ్ మావికి చాన్ష్ దొరికింది. తీరా ఏమైందని చూస్తే అర్షదీప్ మ్యాచ్ ఫిట్ నెస్ తో లేడని తేలింది. రెండో టి20 నాటికి అర్ష కోలుకుని జట్టులోకి వచ్చాడు. రెండో ఓవర్ లో బౌలింగ్ కు దిగిన అతడు.. మళ్లీ 19వ ఓవర్ వరకు బంతిని పట్టలేదు.
శ్రీలంక ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లో హ్యాట్రిక్ నో బాల్స్‌తో మొత్తం 19 పరుగులు సమర్పించాడు. ఇక 19వ ఓవర్‌లోనూ 18 పరుగులు ఇచ్చాడు. దీంతో కేవలం రెండు ఓవర్లలో 37 పరుగులు ఇచ్చేశాడు. అయితే, మొదటి ఓవర్‌లో 5 బంతులు అద్భుతంగానే వేశాడు. ఐదు పరుగులే ఇచ్చాడు. చివరి బంతిని సంధించడంలోనే ఇబ్బంది పడ్డాడు. తొలిసారి నో బాల్స్ కు కుశాల్ మెండిస్ కు, రెండోసారి లంక కెప్టెన్ శనకకు దొరికిపోయాడు.
కాగా, అర్షదీప్ కు మ్యాచ్ ఫిట్ నెస్ ఉందా? లేదా? అతడిని ఫిట్ నెస్ లేకున్నా బరిలో దింపారా? అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.పొడగరి.. అదే బలహీనత..2022 ఐపీఎల్ లో చెలరేగిన అర్షదీప్ అంతర్జాతీయ అరంగేట్రం చేసి ఆరు నెలలు అవుతోంది. అయితే, ఈ వ్యవధిలోనే అతడు తానేంటో చాటాడు. ప్రధాన బౌలర్లలో ఒకడిగా ఎదిగాడు.
అర్షదీప్ 6.2 అడుగుల పొడగరి. అందులోనూ ఎడమ చేతివాటం. దీంతోపాటు స్వింగ్, పేస్ రెండు ఉన్నవాడు. కానీ, నోబాల్స్ బలహీనతను అధిగమించలేకపోతున్నాడు. పాకిస్థాన్ పేసర్ హసన్ అలీ (14 నో బాల్స్) కంటే తక్కువ మ్యాచ్ ల్లోనే ఎక్కువ నో బాల్స్ వేసినవాడిగా ఎవరూ కోరుకోని రికార్డును మూటగట్టుకున్నాడు. రెండో టీ20లో అర్షదీప్ రెండు ఓవర్లు మాత్రమే వేయగా..అందులో నోబాల్స్ 5 పడ్డాయంటే అతనెంతగా అదుపు తప్పాడో అర్థం చేసుకోవచ్చు.
తన తొలి ఓవర్లో వరుసగా మూడు నోబాల్స్ వేసిన అర్ష్‌దీప్‌కు మళ్లీ బౌలింగ్ ఇవ్వడానికి హార్దిక్ భయపడ్డాడు. ఇన్నింగ్ చివర్లో.. అదికూడా మావి, ఉమ్రాన్ కోటా పూర్తవుతున్న సందర్భంలో 19వ ఓవర్లో మళ్లీ బంతి ఇచ్చాడు. అయితే, అందులో 2 నోబ్స్ వేశాడు. అందులో ఒకటి క్యాచ్ ఔట్. నోబాల్ కావడంతో బతికిపోయిన శానక ఫ్రీహిట్‌కు సిక్సర్ బాదాడు. 2 ఓవర్లలోనే అర్ష్‌దీప్ 37 పరుగులు సమర్పించుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.