Begin typing your search above and press return to search.

కరోనా వుహాన్ ల్యాబ్ లో పుట్టిందే - ఫ్రెంచి వైరాలజిస్ట్!

By:  Tupaki Desk   |   19 April 2020 12:09 PM GMT
కరోనా వుహాన్ ల్యాబ్ లో పుట్టిందే - ఫ్రెంచి వైరాలజిస్ట్!
X
కరోనా గబ్బిలం నుంచి రాలేదు. ఇది మనిషి సృష్టించిన వైరస్సే. చైనాలోని వుహాన్ లో పుట్టించిన వైరస్సే అని ఫ్రాన్స్ కు చెందిన నోబెల్ గ్రహీత... ల్యూక్ మెంటాగ్నీర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన ఎయిడ్స్ వ్యాధిని కనుగొన్న ఇద్దరు శాస్త్రవేత్తల్లో ఒకరు. ఎయిడ్స్ వ్యాధికి వ్యాక్సిన్ తయారుచేసే క్రమంలో ఈ వైరస్ పుట్టినట్లు తాను భావిస్తున్నానని ... కోవిడ్ 19 వైరస్ ని పరిశీలిస్తే అర్థమైందన్నారు. ఇందులో హెచ్ ఐవి లోని కొన్ని ఎలిమెంట్లు ఉన్నాయన్నారు.

ల్యూక్ ఫ్రాన్స్ కి చెందిన వైరాలజీ శాస్త్రవేత్త. ఈ సంచలన కామెంట్లు చేసిన ల్యూక్ పనిచేస్తోంది ఎక్కడో తెలుసా... చైనాలోని ఆర్థిక నగరమైన షాంఘై లోని షాంఘై జియావో టాంగ్ యూనివర్సిటీలో వైరాలజీ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. ఆయన పరిశోధన వల్ల ఎందుకు ఇది భారత్ ను ఎక్కువ ప్రభావితం చేయడం లేదు? హైడ్రాక్సీ క్లోరోక్విన్ దీనిపై ఎందుకు పనిచేస్తుందన్న ప్రశ్నకు కూడా ఆయన సమాధానం ఇచ్చినట్లయ్యింది. కరోనా వైరస్ జన్యు క్రమాన్ని విశ్లేషించగా... అందులో హ్యుమన్ ఇమ్యునోడెఫిషియెన్సీ వైరస్ ( ఎయిడ్స్ ) ఎలిమెంట్లతో పాటు మలేరియా క్రిమి ఎలిమెంట్లు కూడా ఉన్నట్లు అర్థమైందన్నారు. అందువల్లే మలేరియాకు వ్యాక్సిన్ తీసుకున్న మనపై దీని ప్రభావం తక్కువగా ఉంది. మలేరియా మందు పనిచేయడానికి కూడా కారణం కూడా ఇదే అని స్పష్టమవుతోంది.

మరి ఈ వైరస్ ఎలా బయటకు వచ్చి ఉంటుందన్న విషయంపై కూడా ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఇటీవలి కాలంలో ఈ ప్రయోగాలు చేస్తున్న వుహాన్ వైరాలజీ లాబ్ లో భారీ ప్రమాదం ఏదైనా సంభివించి ఉంటుందని.. ఆయన అంచనా వేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా వుహాన్ లో కరోనా తరహా భయంకర వైరస్ లపై పరిశోధనలు జరుగుతున్నాయని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా.. రెండు రోజుల క్రితమే ట్రంప్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు. చైనా గబ్బిలాల నుంచి వచ్చిందంటోంది. కానీ గబ్బిలాలు వుహాన్ మార్కెట్ సమీపంలో లేవు. ఇది కచ్చితంగా చైనా సృష్టే. ఇన్వెస్టిగేట్ చేస్తున్నాం. అన్ని నిజాలు బయటపెడతాం అని ట్రంప్ వ్యాఖ్యానించారు.