Begin typing your search above and press return to search.
సెక్స్ ఊబిలో నోబెల్? అసలేం జరిగింది?
By: Tupaki Desk | 26 April 2018 4:56 AM GMTప్రపంచ వ్యాప్తంగా అక్కడా.. ఇక్కడా అన్న తేడా లేకుండా సెక్స్ కుంభకోణాలు బయటకు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ రెండు అక్షరాల మాట.. ఎంతోమంది ప్రముఖులు మొదలు.. సంస్థల ఇమేజ్ ను డ్యామేజ్ చేశాయని చెప్పాలి. ఇప్పుడు ప్రపంచ ప్రఖ్యాతి చెందిన.. గౌరవప్రదమైన సంస్థగా మన్ననలు అందుకునే నోబెల్ అకాడమీకి కూడా సెక్స్ స్కాం చుట్టుకుంది.
ఈ వ్యవహారం ప్రపంచ వ్యాప్తంగా సంచలనంగా మారటమే కాదు.. అత్యంత గౌరవ ప్రతిష్ఠలతో కూడిన సంస్థ సెక్స్ స్కాండల్ లో చిక్కుకుపోవటం ఏమిటన్న ప్రశ్న ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇంతకీ.. ఈ ఇష్యూ ఇప్పుడే ఎందుకు బయటకు వచ్చింది? అసలు దీని వెనుక జరిగిన కతేంది? తర్వాతి పరిణామాలు ఎలా ఉండబోతున్నాయి? లాంటి అంశాల్ని చూస్తే..
అసలీ నోబెల్ అకాడమీ ఏంది?. ఇదేం చేస్తుంది?
ప్రపంచంలోనే అత్యుత్తమ పురస్కారంగా.. ప్రతిష్ఠాత్మకమైన.. గౌరవప్రదమైన సంస్థగా నోబెల్‌కు పేరుంది. ఇందులో మొత్తం ఆరు రంగాలకు చెందిన ప్రముఖులకు ప్రతి ఏటా పురస్కరాన్ని ప్రకటిస్తుంటారు.శాంతి.. సాహిత్యం.. భౌతిక శాస్త్రం.. రసాయన శాస్త్రం.. వైద్యం.. ఆర్థిక రంగాల్లో విశేషకృషి చేసిన వారికి నోబెల్ పురస్కారాన్ని ప్రకటిస్తుంటారు.
అవార్డు ప్రక్రియను చూస్తే.. ఏ రంగానికి చెందిన ఆ రంగానికి సంబంధించిన ప్రముఖులతో కూడిన కమిటీ డిసైడ్ చేసు్తుంది. ఇలా ప్రతి ఏటా ఆరు రంగాలకు చెందిన ప్రముఖుల్ని ఎంపిక చేస్తారు. స్వీడిష్ రాయల్ అకాడమీ సాహిత్య అవార్డును రాయల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్.. ఫిజిక్స్.. కెమిస్ట్రీ.. మెడిసిన్ విజేతలను.. స్వీడన్ లోని మరో సంస్థ ఆర్థిక శాస్త్రానికి సంబంధించిన బహుమతి గ్రహీతను ఎంపిక చేస్తుంది.ఒకే ఒక్క శాంతి బహుమతి మాత్రం నార్వేకు చెందిన అకాడమీ ఎంపిక చేస్తుంది. ఈ అవార్డును సైతం స్వీడిష్ అకాడమీయే ఇస్తుంది.
నోబుల్ కమిటీలో 18 మంది సభ్యులు ఉంటారు. వీరంతా లైఫ్ లాంగ్ సభ్యులు. ఎవరైనా రాజీనామా చేసినా.. సభ్యులుగానే ఉంటారు తప్పించి అకాడమీ వ్యవహారాల్లో క్రియాశీలకంగా పాల్గొనటం అన్నది ఉండదు.
వివాదం ఎక్కడ మొదలైంది?
అసలీ వివాదం అంతా కేటరిన్ ఫ్రాంకెన్ స్టీన్ అనే మెంబర్ తో మొదలైంది. ఆమె ఒక కవయిత్రి.. ఒకసారి నోబెల్ అవార్డు సైతం సొంతం చేసుకుంది. ఆమెగారి భర్త జీన్ క్లాడ్ ఆర్నాల్డ్. సింఫుల్ గా జీన్ అని పిలుచుకుందాం. అయితే.. ఈ పెద్దమనిషి స్వీడన్ లో పేరున్న సాంస్కృతిక కార్యకర్తగా పేరొంది. ఆయన మీద లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. ఒక మహిళతో అసభ్యంగా ప్రవర్తించినట్లుగా తేలింది. దీంతో.. ఆయన బాధితురాళ్లుగా చెప్పుకునే మరికొంత మంది తెర మీదకు వచ్చారు. వారంతా కూడా జీన్ తమను లైంగికంగా వేధించినట్లుగా వెల్లడించారు. దీంతో.. ఇదో వివాదంగా మారి.. ప్రపంచ వ్యాప్తంగా అందరి దృష్టి పడేలా చేసింది. చివరకు ఇదో వివాదంగా మారింది.
లైంగిక ఆరోపణలు సరిపోవన్నట్లుగా మరికొన్ని వ్యవహారాలు బయటకు వచ్చాయి. సీక్రెట్ గా సాగాల్సిన నోబెల్ బహుమతి గ్రహీతల ఎంపిక సైతం తప్పుడుదారుల్లోకి వెళ్లినట్లుగా చెబుతారు. అయితే.. ఈ పనంతా కూడా నోబెల్ బహుమతి గ్రహీత అయినా అతడి భార్య సాయంతో జరిగినట్లుగా చెబుతున్నారు. దీంతో.. ఈ వ్యవహారం నోబెల్ సాహిత్యం అవార్డును ఎంపిక చేసే మీటింగ్ లలో కేటరిన్ ను బ్యాన్ చేయాలని కొందరు పట్టుపట్టారు. ఈ డిమాండ్ పై శాశ్విత కార్యదర్శి ప్రొఫెసర్ సానా నో చెప్పేశారు. దీనికి బదులు అన్నట్లుగా ఆరుగురు తమ బాధ్యతల నుంచి తప్పుకున్నారు. దీంతో.. ఈ వివాదం మరింత ముదిరిపోవటమే కాదు.. కొత్త కొత్త తలకాయల ఎంట్రీకి మార్గం సుగుమం చేసిందని చెప్పక తప్పదు.