Begin typing your search above and press return to search.

అమ్మఒడి పథకం పై నోబెల్ విన్నర్ ప్రశంసలు !

By:  Tupaki Desk   |   28 Jan 2020 7:18 AM GMT
అమ్మఒడి పథకం పై నోబెల్ విన్నర్ ప్రశంసలు !
X
ఆంధప్రదేశ్ ప్రభుత్వం ఎన్నికల హామీలలో చెప్పిన విదంగా అమలులోకి తీసుకొచ్చిన అమ్మఒడి పై పలువురు ప్రముఖులు ప్రశంసలు కురిపిస్తున్నారు. తాజాగా సీఎం జగన్ తీసుకువచ్చిన అమ్మఒడి పతాకాన్ని నోబెల్ అవార్డు గ్రహీత జాన్ బి గుడెన‌ఫ్ ప్ర‌శంసించారు. సాధారణంగా నోబెల్ అవార్డు గ్రహీతలు ఎవరైనా కూడా ఎవరిని పెద్దగా కలవడానికి కానీ , దేనిపై నైనా కూడా స్పందించడానికి కూడా ఇష్ట పడరు. వారిలోకం వేరు. నిరంతరం వారు చేసే ప్రయోగాలపైనే దృష్టి పెడుతుంటారు. జాన్ బి గుడెన‌ఫ్ కూడా డే కోవకి చెందినవారే.

త‌ల్లి గ‌ర్భం నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి, మ‌నిషి మ‌ట్టిలో క‌లిసిపోయేంత వ‌ర‌కూ మ‌నిషి ఏదో ఒక‌టి నేర్చుకుంటూనే ఉండాల‌నే త‌త్వాన్ని పాటించాల‌నే గుడెన‌ఫ్ , ఈ ప్రపంచంలోని మానవాళి ప్ర‌గ‌తికి త‌న‌వంతుగా ఎంతో కృషి చేశారు. ప్ర‌స్తుతం మ‌న వాడే స్మార్ట్ ఫోన్లు, కెమెరాలు త‌దిత‌రాల్లో వాడే లిథియ‌మ్ ఇయాన్ బ్యాట‌రీల్లో క్యాథోడ్ ను ఆవిష్క‌రించింది కూడా ఈయనే. దీనికి గాను ఆయన కి 2019 లో నోబెల్ అవార్డు వచ్చింది. పని, పని, పని ..తల్లి గర్బము నుండి భూమి మీదకి వచ్చిన క్షణం నుండి మళ్లీ భూమిలోకి చేరేవరకు కూడా పనిచేస్తూనే ఉండాలన్నది అయన తత్వం. ఆ సిద్దాంతాన్నే అయన నమ్మి గత 98 ఏళ్లుగా నిరంతరం పని చేస్తూనే ఉన్నారు.

ఇకపోతే , ఈ 98 యేళ్ల ఈ వ‌ర‌ల్డ్ క్లాస్ ఇన్వెంట‌ర్ దృష్టికి ఏపీ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న .అమ్మ ఒడి' ప‌థ‌కాన్ని ఓవ‌ర్సీస్ ఎడ్యుకేషన్ విభాగం తీసుకెళ్లింది. భార‌త్ వంటి దేశంలో పిల్ల‌లను చ‌దువుకు పంపించే త‌ల్లికి ఆర్థికంగా సాయం అందించే ప‌థ‌కాన్ని ప్రవేశ పెట్టిన ప్రభుత్వం పై , సీఎం జగన్ పై ఈ నోబెల్ గ్ర‌హీత ప్రశంసలు కురిపించారు. ప్రతి మనిషికి గరిష్టంగా లబ్ది , ప్రయోజనం పొందేలా సంక్షేమ పథకాలని రూపొందించాలని , వాటి ఫలితం ప్రతి ఒక్కరికి అందినప్పుడే అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అని తెలిపారు. ఆ దిశగా అడుగులు వేస్తున్న ఏపీ ప్రభుత్వ కృషిని అభినందించారు. నేర్చుకోవ‌డం మ‌నిషి విధి అనే ఈ నోబెల్ గ్ర‌హీత‌కు ఇండియాలో ఉన్న ప‌రిస్థితుల గురించి ప్రత్యేకంగా తెలియనివి కావు. మ‌న ద‌గ్గ‌ర నేర్చుకోవాల‌నే ఆస‌క్తి ఉన్నా ఎంతో మంది పిల్ల‌ల‌కు ఆర్థిక శ‌క్తి లేక మంచి చ‌దువులు చ‌దివే అవ‌కాశం లేకుండా పోతోంది. ఇదే ఇండియాకు పెద్ద శాపం.

ఇలాంటి నేప‌థ్యంలో అమ్మ ఒడి వంటి ప‌థ‌కం ఎంతోమంది పేద విద్యార్ధులకి ఆసరాగా నిలిచే అవకాశం ఉంది. ఇప్ప‌టికీ పిల్ల‌ల‌ను బాల కార్మికులుగా కొన‌సాగుతూ ఉన్నారు. ఇలాంటి నేప‌థ్యంలో ఏపీ ప్ర‌భుత్వం అమ్మ ఒడి ప‌థ‌కం ద్వారా పిల్ల‌ల‌ను చ‌దువుకు పంపించే త‌ల్లి కి ఆర్థిక సాయం చేస్తూ ఉంది. ప్రైవేట్ స్కూళ్ల‌కు పిల్ల‌ల‌ను పంపించే త‌ల్లుల‌కు అది ఫీజుల‌కు, ప్ర‌భుత్వ స్కూళ్లకు పిల్ల‌ల‌ను పంపించే వాళ్ల‌కు పోష‌ణ‌కు ఉపయోగపడుతుంది. ఈ నేప‌థ్యంలో సీఎం జగన్ తీసుకొచ్చిన అమ్మఒడి ప‌థ‌కాన్ని నోబెల్ గ్ర‌హీత కూడా ప్రశంసించడం విశేషం. అలాగే ఈ విషయాన్ని చెప్తూ అయన ఒక వీడియో మెసేజ్ ను కూడా విడుద‌ల చేశారు.