Begin typing your search above and press return to search.
బీజేపీ వల్ల బీఫ్ పై కోరిక పుట్టింది: సీఎం
By: Tupaki Desk | 30 Oct 2015 8:32 AM GMTగోమాంసం విషయంలో దేశ వ్యాప్తంగా చర్చ జరుగుతున్న తరుణంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య దానిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. గోమాంసం తినాలనిపిస్తే తాను తింటానని, తాను ఇంతవరకు అది తినకపోయినా తినాలనుకుంటే వెంటనే తినగలనని.. వద్దనడానికి మీరెవరు? అంటూ పరోక్షంగా బీజేపీ నాయకులను ప్రశ్నించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై తీవ్ర దుమారం రేగుతోంది.
బెంగళూరు నగరంలోని టౌన్ హాల్ లో యువజన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో సీఎం సిద్దరామయ్య మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఇప్పటి వరకు గోమాంసం తినలేదని స్పష్టం చేశారు. అయితే తినాలనిపిస్తే తనను ఎవ్వరూ ఆపలేరని చెప్పారు. కర్ణాటకలో గోహత్య నిషేధంపై జరిగిన చర్చలో ఇదే విషయం చెప్పానని గుర్తు చేశారు. ఆహారపదార్థాలు తినరాదని ఎదుటి వారికి చెప్పడం మంచిది కాదని అన్నారు. ఎవరి ఇష్టాలు వారికి ఉంటాయని, వాటిని వ్యతిరేకించడం మంచి పద్దతి కాదని చెప్పారు. కొన్ని సంప్రదాయాల ప్రకారం మంగళవారం క్షౌరం చేయించుకోవడం మంచిది కాదని గుర్తు చేశారు. అయితే తాను మాత్రం మంగళవారం క్షౌరం చేయించుకుంటానని సిద్దరామయ్య అన్నారు. మంగళూరు సమీపంలో జరిగిన సంఘటనను సీఎం సిద్దరామయ్య ఖండించారు. ఇతరుల ఆహార అలవాట్ల పట్ల అసహనం పనికిరాదని సూచించారు.