Begin typing your search above and press return to search.

నోకియా 3310 మళ్లీ వ‌చ్చేసిందిగా!

By:  Tupaki Desk   |   27 Feb 2017 10:59 AM GMT
నోకియా 3310 మళ్లీ వ‌చ్చేసిందిగా!
X
నోకియా... ఒక‌ప్పుడు మొబైల్ వినియోగ‌దారుల‌కు చిర‌ప‌ర‌చిత‌మైన పేరు. క‌నెక్టింగ్ పీపుల్ అంటూ ట్యాగ్ లైన్ పెట్టుసుకుని వ‌చ్చిన ఈ కంపెనీని ప్ర‌తి మొబైల్ వినియోగ‌దారుడు త‌న కంపెనీగానే భావించేలా ఉండేది నాటి ప‌రిస్థితి. అయితే స్మార్ట్ ఫోన్ల ఎంట్రీతో ఆ పోటీని త‌ట్టుకోలేక నోకియా ఏకంగా త‌న వ్యాపారాన్నే అమ్మేసుకుని క‌నుమ‌రుగైపోయింది. మొబైల్ హ్యాండ్ సెట్ల రంగంలో నోకియాకు ఉన్న ఇమేజీని ప‌సిగ‌ట్టేసిన త‌ర్వాతే ఆ కంపెనీని కొనుగోలు చేసిన హెచ్ ఎండీ గ్లోబ‌ల్... తాజాగా ఆ బ్రాండ్‌ తోనే లాభాలు ఆర్జించుకునే ప‌నిని ప్రారంభించింది. ఇందులో భాగంగా నోకియాకు ఆయువుప‌ట్టుగా నిలిచిన బేసిక్ మోడ‌ల్ నోకియా 3310ను రీ లాంచ్ చేసింది. నిన్న నిర్వ‌హించిన‌ మొబైల్ వర్డ్ కాంగ్రెస్ లో హెచ్‌ఎండీ గ్లోబల్‌ కంపెనీ సీఈవో ఆర్టో నుమ్మెల దీన్ని లాంచ్‌ చేశారు.

పాత మోడ‌ల్ లోని ఫీచ‌ర్ల‌ను ఏమాత్రం మార్చ‌ని హెచ్ఎండీ గ్లోబ‌ల్... హ్యాండ్ సెట్ ను మ‌రింత విజువల్‌ అప్‌గ్రెడేషన్ చేసి... కాస్తంత కొత్త‌గా మార్కెట్లోకి తెచ్చింది. బ్యాట‌రీ విష‌యంలోనూ పాత మోడ‌ల్ కంటే ఈ ఫోన్ కాస్తంత మెరుగ్గానే ఉంద‌ట‌. ఇక ధ‌ర విష‌యానికి వ‌స్తే... నాడు ఇత‌ర ఫోన్ల‌తో పోలిస్తే త‌క్కువ ధ‌ర‌కే నోకియా 3310 ల‌భించ‌గా, ఈ సారి కూడా దాని ధ‌ర‌ను త‌క్కువ‌గా నిర్ణ‌యించారు. చైనా మేడ్ స్మార్ట్ ఫోన్ల‌తో పోలిస్తే... కాస్తంత ఎక్కువ‌గానే క‌నిపించే ఈ ఫోన్ ధ‌ర‌ను 49 యూరోలుగా నిర్ణ‌యించార‌ట‌. అంటే మ‌న క‌రెన్సీలో దీని రేటు రూ.3,400 మాత్ర‌మేన‌ట‌. అయినా స్మార్ట్ ఫోన్లు రాజ్య‌మేలుతున్న ప్ర‌స్తుత త‌రుణంలో నోకియా 3310 ఏ మేర‌కు రాణిస్తుందో చూడాలి.

ఇదిలా ఉంటే... నోకియా 3310తో పాటు హెచ్ఎండీ గ్లోబ‌ల్్ నోకియా బ్రాండ్‌తోనే మ‌రో మూడు స్మార్ట్ ఫోన్ల‌ను మార్కెట్‌లోకి విడుద‌ల చేసింది. నోకియా 3 - నోకియా 5 - నోకియా 6 పేరిట విడుద‌లైన ఈ ఫోన్లు కూడా ఇత‌ర స్మార్ట్ ఫోన్ల‌కు గ‌ట్టి పోటీ ఇచ్చేట‌ట్టుగానే ఉన్నాయి. ఆండ్రాయిడ్‌ 7.1 నోగట్‌ ఆధారంగా పనిచేసే నోకియా 5 - 6 - 3 స్మార్ట్‌ ఫోన్ల ద‌ర‌ల విష‌యానికి వ‌స్తే... నోకియా 6 ధర సుమారు రూ.16,100గాను - దీనిలోని స్పెషల్‌ ఎడిషన్‌ ధరను సుమారుగా రూ. 21వేలుగాను - నోకియా 5 ధరను సుమారు 13,300గాను - నోకియా 3 ధర సుమారు 9,700 ఉండనున్నట్టు కంపెనీ వెల్లడించింది. నోకియా 3310తో పాటు మిగిలిన మూడు మోడ‌ళ్లు మార్కెట్లోకి నిన్న‌నే విడుద‌లైనా.. మ‌న‌కు మాత్రం ఈ మార్చి త‌ర్వాత గాని అందుబాటులోకి రావ‌ట‌.

నోకియా 3310 ఫీచర్లు విష‌యానికొస్తే...

2.4 అంగుళాల క్యూవీజీఏ స్క్రీన్

2జీ కనెక్టివిటీ,

16 ఎంబీ ఇంటర్నల్‌ స్టోరేజ్,

32జీబీ ఎక్స్‌పాండబుల్‌ స్టోరేజ్‌

డ్యూయల్ సిమ్

2 ఎంపీ రియర్ కెమెరా విత్‌ ఎల్ ఈడీ ఫ్లాష్

1200 ఎంఏహెచ్‌ బ్యాటరీ


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/