Begin typing your search above and press return to search.
అసలు కథ.. ఊపందుకున్న నామినేషన్లు..!
By: Tupaki Desk | 20 March 2019 10:39 AM GMTసోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలు అయినా.. తొలి రోజు దాఖలైన నామినేషన్లు కొన్నే. మరీ ఉత్సాహవంతులు తప్ప మరెవరూ తొలి రోజు పెద్దగా నామినేషన్లు దాఖలు చేయలేదు. ఇక రెండో రోజు మంగళవారం. దీంతో ఆ రోజున నామినేషన్లు దాఖలు చేయడానికి నేతలు ఎవరూ ఉత్సాహం చూపించలేదు. మంగళవారం రోజున నామినేషన్లు వేయడానికి మంచిది కాదన్నట్టుగా చాలామంది అందుకు ముందుకు రాలేదు. యాంటి సెంటిమెంట్ గా భావించి నిన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు.
అయితే బుధవారం మాత్రం నామినేషన్ల ఊపు కనిపించింది. ఈ రోజున చాలా మంది అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేశారు. మధ్యాహ్నం మూడు గంటల వరకూ మాత్రమే అధికారులు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో చాలా మంది ఉదయం పూటే నామినేషన్లను దాఖలు చేశారు.
ఈ నామినేషన్ల దాఖలు విషయంలో నేతలు ముహూర్తాలు - తమ గ్రహబలాలకు ఉన్న అనుకూలతల గురించి బాగా చూసుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ దీంతో సెంటిమెంటల్ ఆ పని పూర్తి చేస్తూ ఉన్నారు. వచ్చే సోమవారం వరకూ నామినేషన్లను దాఖలు చేయడానికి అవకాశం ఉంది. అయితే.. ఈ మధ్యలోనే రెండు రోజుల సెలవులున్నాయి. దీంతో ఇక నామినేషన్లకు పెద్దగా సమయం ఏమీ లేనట్టే.
కాబట్టి ఈ రోజు చాలా మంది నామినేషన్లు దాఖలు చేశారు. మరి కొందరు తమ అనుకూల ముహూర్తం కోసం ఎదురుచూస్తున్నారు.
ఆలయాల్లో పూజల అనంతరం నేతలు నామినేషన్లు దాఖలు చేశారు. కొందరు తమ లక్కీ హ్యాండ్స్ తో నామినేషన్ పత్రాలను ఇప్పించారు. రాజంపేట ఎంపీ గా పోటీ చేస్తున్న మిథున్ రెడ్డి తన తల్లి చేత నామినేషన్ పత్రాలను ఇప్పించారు.