Begin typing your search above and press return to search.

ఇంట‌ర్నెట్ లేదా... నోమోఫోబియా

By:  Tupaki Desk   |   27 Aug 2015 12:34 PM GMT
ఇంట‌ర్నెట్ లేదా... నోమోఫోబియా
X
ఇప్పుడు ప్ర‌పంచాన్ని ఓ స‌రికొత్త ఫోబియా ప‌ట్టి పీడిస్తోంది. ఇది క్ర‌మ క్ర‌మంగా విస్త‌రిస్తూ ప్ర‌పంచం మొత్తం పాకుతోంది. ఈ ఫోబియా మ‌న‌లోను ఉండ‌వ‌చ్చు..కానీ మ‌న‌కు తెలియ‌దు. ఈ విష‌యం గురించి ఇప్పుడిప్పుడే చ‌ర్చ‌లు స్టార్ట్ అయ్యాయి. సోష‌ల్ మీడియా ఇప్పుడు ఓ ఊపు ఊపుతోంది. పొద్దున్న లేచిన ద‌గ్గ‌ర నుంచి రాత్రి ప‌డుకునే వ‌ర‌కు చేతితో ఫోన్ ఉండాలి...ఫోన్‌ కు నెట్ క‌నెక్ష‌న్ ఉండాలి. ఫేస్‌ బుక్‌, ట్వీట్ట‌ర్‌, మెసెంజ‌ర్ ఎప్పుడు..ఏం జ‌రుగుతుందో..ఇంకా చెప్పాలంటే మినిట్ మినిట్‌ కు అప్‌ డేట్ అయిపోవాల్సిందే...లేక‌పోతే యూత్‌ కు పిచ్చెక్కిపోయినట్టు ఉంటోంది.

అమెరికాకు చెందిన అసోసియేట్ ప్రొఫెస‌ర్ ఆనాపాల్ కోరియో , పీహెచ్‌ డీ స్టూడెంట్ కాగ్ల‌ర్ ఇల్డిర‌మ్ క‌లిపి చేసిన ప‌రిశోధ‌న‌ల్లో ఈ ఫోబియో బ‌య‌ట‌ప‌డింది. మొబైల్ ఫోన్ లేకుండా ఉండ‌లేక‌పోవ‌డం...స్మార్ట్ ఫోన్‌ లో డేటా లేక‌పోతే భ‌రించ‌లేక‌పోవ‌డంతో పాటు వారికి అర‌చేతిలోని మొబైల్‌ లో ఎల్ల‌ప్పుడు ప్ర‌పంచం క‌న‌ప‌డుతూ ఉండాలి లేక‌పోతే వారు కొత్త మ‌నోవ్య‌ధ‌కు గుర‌వుతారు...దీనికి ఆ ప‌రిశోధ‌కులు పెట్టిన పేరే నోమోఫోబియో.

వివిధ ర‌కాల‌కు చెందిన వ్య‌క్తుల‌పై త‌మ ప‌రిశోధ‌న‌ల‌కు గాను వారు 1 నుంచి 7 జ‌వాబులు ఇచ్చారు. 1లో నేను గ‌ట్టిగా వ్య‌తిరేకిస్తాను....7లో నేను గ‌ట్టిగా అంగీక‌రిస్తాను అనే జ‌వాబులు ఉంటాయి. మిగిలిన వాటిల్లో నేను ఫోన్ లేక‌పోతే చాలా ఇబ్బంది ప‌డ‌తాను...ఇంట‌ర్ నెట్ క‌నెక్ట్‌కాక‌పోతే భ‌రించ‌లేను...ప్ర‌పంచంలో ఏం జ‌రుగుతుందో నా అర‌చేతిలో తెలియ‌క‌పోతే చాలా నెర్వ‌స్‌ గా ఫీల‌వుతాను ఇలాంటి జవాబులు ఇచ్చారు. వీటిలో అవును అని చెప్పిన వాళ్ల‌కు ఈ నోమోఫోబియో ఉన్న‌ట్టే లెక్క‌. ఈ ఏడు ప్ర‌శ్న‌ల్లోఎవ‌రు ఎన్ని ఎక్క‌వ ప్ర‌శ్న‌ల‌కు అవును అని స‌మాధ‌ధానం ఇస్తే వారికి అంత ఎక్కువ‌గా నోమోఫోబియో ఉన్న‌ట్టు భావించాలి.