Begin typing your search above and press return to search.
అసెంబ్లీ అయితే అడిగేవారు లేరేమో కానీ...
By: Tupaki Desk | 11 April 2015 8:56 AM GMTఅసెంబ్లీకి సరిగా హాజరు కాకపోయినా పెద్దగా అడిగేవారు ఉండకపోవచ్చు! అలా గైర్హజరయ్యే వారిపై ఇప్పటివరకూ చర్యలు తీసుకున్న సందర్భాలు కూడా లేవనే చెప్పాలి. ఇదే అలవాటులో పొరపాటుగానో లేక మంత్రిని కదా అని ఫీలయ్యారో తెలియదు కానీ... కోర్టు విచారణకు హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నారు ఒక మంత్రి వర్యులు. ఈయనపై కోర్టు నాన్ బెయిల బుల్ వారెంట్ జారీ చేసింది.
వివరాల్లోకి వెళితే... ఉత్తరప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి యాసిర్ షా పై నాన్ బెయిలబుల్ వారెంట్ జారి అయ్యింది. 2007 లో ఒక వ్యక్తిని గృహ నిర్బంధం చేసినట్లు ఈయనపై కేసు నమోదయింది. ఈ కేసు విచారణలో భాగంగా కోర్టు అనేక సార్లు సమన్లు జారి చేసినా కాని మంత్రివర్యులు వాటిని ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇలా పదే పదే హోర్టుకు కోర్టుకు గైర్హజరవుతున్నాడని ఆగ్రహించిన చీఫ్ జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ బర్బాంకి సర్వజీత్... కోర్టు ధిక్కారానికి పాల్పడుతున్న నేరంపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేశరు!