Begin typing your search above and press return to search.
చీటింగ్ కేసుతో చిక్కుల్లో పడ్డ రేణుక
By: Tupaki Desk | 30 Aug 2019 8:02 AM GMTయూపీఏ హయాంలో కేంద్రమంత్రిగా ఓ వెలుగు వెలిగిన కాంగ్రెస్ సీనియర్ నాయకురాలు రేణుకాచౌదరి చిక్కుల్లో పడ్డారు.ఆమెపై ఖమ్మం జిల్లాలో చీటింగ్ కేసు నమోదైంది. అంతేకాదు.. ఆ కేసులో కోర్టుకు హాజరు కానందుకు ఆమెకు నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ కూడా జారీ కావడంతో రేణుక ఇరుకునపడ్డారు.
గత సార్వత్రిక ఎన్నికల సందర్భంగా ఖమ్మం ఎంపీగా రేణుకా చౌదరి కాంగ్రెస్ తరుఫున పోటీపడ్డారు. ఆ సమయంలోనే ఎమ్మెల్యే టికెట్లపై కొందరు ఆశావహులకు రేణుక హామీ ఇచ్చారు. అయితే నెరవేర్చలేకపోయారట.. దీంతో తన భర్తకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తానంటూ రేణుక తమను మోసం చేసిందని కళావతి అనే మహిళ ఖమ్మం కోర్టులో గతంలో పిటీషన్ దాఖలు చేసింది. పిటీషన్ విచారణకు స్వీకరించిన ఖమ్మం జిల్లా రెండో అదనపు ఫస్ట్ క్లాస్ కోర్టు న్యాయమూర్తి ఈ మేరకు రేణుకకు నోటీసులు పంపారు. అయితే నోటీసులకు రేణుకా చౌదరి స్పందించలేదు.. కోర్టుకు హాజరు కాలేదు..
దీంతో ఇన్నిరోజులు వేచి చూసిన కోర్టు తాజాగా రేణుకా చౌదరికి నాన్ బెయిలబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో రేణుక కోర్టులో లొంగిపోయి బెయిల్ తీసుకుంటారా? దీనిపై హైకోర్టుకు వెళతారా అన్నది వేచిచూడాలి.