Begin typing your search above and press return to search.
నాటి గాయం గురించి సుదీర్ఘ పోస్టు పెట్టిన భావన
By: Tupaki Desk | 12 Jan 2022 3:41 AM GMTఒక పేరున్న హీరోయిన్. సినిమా షూటింగ్ ముగించుకొని ఇంటికి వెళుతోంది. అనూహ్యంగా సదరు హీరోయిన్ ను కిడ్నాప్ చేయటం.. ఆమెపై లైంగిక వేధింపులు చోటు చేసుకోవటం.. ఆ దారుణానికి పాల్పడింది సూపర్ స్టార్ గా పేరు ప్రఖ్యాతులు ఉన్నఒక రీల్ హీరో కావటం. ఇదేమీ సినిమా కథ కాదు. రియల్ స్టోరీ. విన్న వెంటనే ఏ మాత్రం నమ్మశక్యం కాని రీతిలో ఉండే ఈ దారుణం.. ఎంతకూ జీర్ణించుకోలేం. అలాంటిది.. ఆ వేదనను భరించిన నటిని ఏమనాలి? ఆమెకున్న ధైర్యానికి.. ఆమెకున్న పట్టుదలకు జోహార్లు చెప్పాల్సిందే. ఇంతకూ అంతటి నరకాన్ని అనుభవించిన ఆ హీరోయిన్ పేరు భావన.
మలయాళ నటిగా గుర్తింపు పొందిన భావన.. తెలుగు సినిమాల్లోనూ నటించింది. కాకుంటే.. లక్ సరిగా లేకపోవటం కారణంగా.. ఆమె అందానికి.. ఆమెకున్న టాలెంట్ కు తగిన సినిమాలు పడలేదనే చెప్పాలి. తెలుగులో ఆమె ఒంటరి, మహాత్మ, నిప్పు సినిమాల్లో నటించింది. అయితే.. రావాల్సినంత గుర్తింపు మాత్రమే కాదు.. అవకాశాలు కూడా రాలేదనే చెప్పాలి. ఇంతకీ ఆమెకు ఎదురైన చేదు అనుభవం ఐదేళ్ల క్రితం (2017, ఫిబ్రవరి 17న) జరిగింంది. అప్పట్లో ఈ వ్యవహారం పెను సంచలనంగా మారింది.
ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న మలయాళ సూపర్ స్టార్ దిలీప్ కుమార్ పై తాజాగా నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు. భావనను లైంగిక వేధింపులకు గురి చేసిన వేళ.. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు అరెస్టు చేయటమే కాదు.. కొంతకాలం జైల్లో ఉంచారు.ఈ కేసులో దిలీప్ తో పాటు.. అతని సోదరుడు అనూప్.. బంధువు సూరజ్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులపైనా నాన్ బెయిలబుల్ కేసును నమోదు చేశారు.
తనకు ఎదురైన చేదు అనుభవాన్ని ఈ సందర్భంగా సినీ నటి భావన సోషల్ మీడియాలో ఒక సుదీర్ఘ పోస్టులో వెల్లడించారు. తన మనసులోని మాటల్ని నిర్మోహమాటంగా చెప్పేశారు. అందులో ఏమున్నదంటే.. బాధితురాలిగా.. ప్రాణాలతో బయటపడే వరకు ఈ ప్రయాణం అంత సులువైనది కాదు. ఐదేళ్లుగా నాపై జరిగిన దాడి.. నా పేరు.. నా ఐడెంటినీ అణిచివేయబడ్డాయి.
నేరం చేసింది తాను కాదని.. కానీ.. తననుఅవమానించటానికి.. మౌనంగా ఉంచటానికి.. ఒంటరిగా ఉంచేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. ఆ సమయంలోనూ నా గొంతును సజీవంగా ఉంచటానికి ముందుకు వచ్చిన వారు కూడా ఉన్నారన్నారు. ఇప్పుడు తాను చాలామంది గొంతులు వింటున్నట్లు చెప్పారు. న్యాయం కోసం ఫైట్ చేయాలనే ఈ ప్రయత్నంలో తాను ఒంటరిని కాదని తనకు తెలుసన్నారు.
న్యాయం గెలవాలని.. తప్పు చేసిన వారికిశిక్ష పడేలా చూడాలని.. మరెవరికీ అలాంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు తాను తన ప్రయాణాన్ని కొనసాగిస్తానని చెప్పారు. ఈ సందర్భంగా తనకు మద్దతుగా నిలిచిన వారందరికి ఆమె థ్యాంక్స్ చెప్పుకొచ్చారు. ఏమైనా రీల్ కథల్లో మాదిరి ఎదరయ్యే అనుభవాన్ని.. గుండెల్ని మెలి పెట్టేలాంటి దారుణ అనుభవాన్ని ఎదుర్కొని.. అందుకు సంబంధించిన అన్యాయాన్ని ప్రశ్నిస్తూ.. పోరాడటం అంత తేలికైన విషయం కాదన్నది మర్చిపోకూడదు.