Begin typing your search above and press return to search.

జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్

By:  Tupaki Desk   |   7 March 2020 5:49 AM GMT
జయప్రదకు నాన్ బెయిలబుల్ వారెంట్
X
ప్రముఖ సినీ నటి, బీజేపీ నాయకురాలు జయప్రదకు ఉత్తరప్రదేశ్ లోని రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. ఈమె 2019 పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిని గా రాంపూర్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన విషయం అందరికి తెలిసిందే. అయితే , ఆ ఎన్నికలలో సమాజ్‌ వాదీపార్టీ అభ్యర్థి ఆజంఖాన్ చేతిలో ఆమె లక్ష ఓట్లకు పైగా తేడాతో పరాజయం పాలయ్యారు.

ఇకపోతే, 2019 పార్లమెంట్ ఎన్నికల సమయంలోనే , జయప్రద ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారంటూ పోలీసులు ఆమెపై కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో, కోర్టు విచారణకు ఆమె హాజరుకాకపోవడంతో రాంపూర్ కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ ను జారీ చేసింది. జయప్రదపై నమోదైన మోడల్ కోడ్ ఆఫ్ కాండాక్ట్ ఉల్లంఘన కేసు తదుపరి విచారణ ఏప్రిల్ 20వ తేదీన జరగనుంది.

గతంలో రాంపూర్ నియోజకవర్గం నుంచి సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థిగా పోటీచేసిన జయప్రద ఎంపీగా గెలిచారు. అయితే , 2019 ఎన్నికలకి ముందు ఆమె సమాజ్ వాదీ పార్టీ కి గుడ్ బై చెప్పి ..బీజేపీ లో చేరి , బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగి పరాజయం పాలైయ్యారు.