Begin typing your search above and press return to search.

శ్రీనగర్ విద్యార్థులు రాక్షసుల కంటే ఘోరమా?

By:  Tupaki Desk   |   8 April 2016 7:24 AM GMT
శ్రీనగర్ విద్యార్థులు రాక్షసుల కంటే ఘోరమా?
X
శ్రీనగర్ ఎన్ ఐటీలో స్థానిక విద్యార్థులకు - ఇతర రాష్ట్రాల విద్యార్థులకు మధ్య ఘర్షణలు జరుగుతన్న విషయం తెలిసిందే. టీ20 క్రికెట్ మ్యాచ్ సందర్భంగా రగిలిచిన చిచ్చు ఇంకా అక్కడ ఆరలేదు సరికదా పరిస్థితులు రోజురోజుకూ మరింత దారుణంగా మారుతున్నాయి. స్థానికేతర విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ, దాదాపు 2 వేల మందికి పైగా స్థానికేతర విద్యార్థినీ విద్యార్థులు తరగతులకు వెళ్లకుండా నిరసనలు తెలుపుతున్నారు. అలా నిరసన తెలుపుతున్న విద్యార్థులకు తీవ్ర బెదిరింపులు ఎదురవుతున్నాయి. అమ్మాయిలనైతే అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారట. వెంటనే తరగతులకు రాకుంటే, స్థానికులతో అత్యాచారం చేయిస్తామని సహ విద్యార్థినిలు బెదిరిస్తున్నారని ఇక్కడ విద్యను అభ్యశిస్తున్న ఇతర రాష్ట్రాల అమ్మాయిలు భయపడుతూ చెబుతున్నారు.

తమలో అభద్రతా భావం పెరిగిపోయిందని చెప్పిన బీహార్ విద్యార్థిని - తమకు న్యాయం జరిగేంత వరకూ నిరసనలు ఆపబోమని హెచ్చరించింది. కేవలం 10 శాతం స్థానిక విద్యార్థులు మాత్రమే తరగతులకు వెళుతున్నారని, మిగతా 90 శాతం తరగతులకు వెళ్లడం లేదని తెలిపారు. ఇదిలావుండగా, స్థానికేతరులు పోలీసులపై రాళ్ల దాడి చేస్తున్న దృశ్యాలు బయటకు విడుదలయ్యాయి. వర్శిటీలో పరీక్షలు యథావిధిగా జరుగుతాయని, వీటికి హాజరు కానివారు తదుపరి పరీక్షలు రాయవచ్చని అధికారులు తెలిపారు. మొత్తానికి శ్రీనగర్ విద్యార్థులు ఇప్పుడు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతున్నారు. యూనివర్సిటీల్లో గతంలోనూ ఎన్నో ఆందోళనలు, ఘర్షణలు జరిగినా ఇలా విద్యార్థినులను అత్యాచారం చేస్తామని బెదిరించిన ఉదంతాలు ఎన్నడూ లేవు.