Begin typing your search above and press return to search.

శాన్‌ ఫ్రాన్సిస్కో టు బెంగళూరు నాన్ స్టాప్ ఫ్లైట్.. సో స్పెషల్

By:  Tupaki Desk   |   10 Jan 2021 10:45 AM GMT
శాన్‌ ఫ్రాన్సిస్కో టు బెంగళూరు నాన్ స్టాప్ ఫ్లైట్.. సో స్పెషల్
X
17 గంటల జర్నీ. 14 వేల కిలోమీటర్ల నాన్ స్టాప్ జర్నీ పెద్ద విషయమే కాదు. మరి.. అదో ప్రత్యేకమైనట్లుగా ఎందుకు చెబుతున్నారు? అన్న సందేహం కలుగుతుందా? అవును.. ఈ ఫ్లైట్ జర్నీ సో స్పెషల్. ఎందుకంటే.. ఎయిరిండియాకు చెందిన మహిళా పైలెట్లు చరిత్ర సృష్టించబోతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో నుంచి బెంగళూరుకు తొలి సుదూర నాన్‌స్టాప్‌ కమర్షియల్‌ విమానాన్ని పూర్తిగా మహిళా పైలెట్లే నడపనున్నారు.

ఈ ఫ్లైట్ ఉత్తర ధ్రువం మీదుగా వెళ్లి అట్లాంటిక్ మార్గంలో ప్రయాణించి బెంగళూరుకు చేరుకోనుంది. గాలి వేగానికి అనుసరించి మొత్తం ప్రయాణ సమయం 17 గంటలకు కాస్త అటు ఇటుగా ఉంటుందంటున్నారు. ఈ రెండు మహానగరాల మధ్య దూరం 14 వేలకు కాస్త తక్కువ (సరిగ్గా చెప్పాలంటే 13,993కి.మీ.) కెప్టెన్ జోయా అగర్వాల్.. కెప్టెన్ తన్మయి.. కెప్టెన్ ఆకాన్ష సోనావర్.. కెప్టెన్ శివాణి మన్హాస్ తోపాటు మరికొందరు మహిళా కాక్ పిట్ సిబ్బంది ఈ చారిత్రక విమాన జర్నీలో పాలు పంచుకోనున్నారు.

పూర్తిస్థాయిలో మహిళా సిబ్బందితో నడపున్న సుదీర్ఘ ప్రయాణం జరిపే ఫ్లైట్ కు సంబంధించిన విశేషాల్ని కేంద్ర పౌర విమానయాన శాఖా మంత్రి హర్ దీప్ సింగ్ పురి ప్రత్యేకంగా వెల్లడించారు. మన మహిళలు దేన్లోను తక్కువ కాదన్న విషయం తాజాగా.. నాన్ స్టాప్ ఫ్లైట్ జర్నీతో చెప్పేస్తున్నట్లుగా చెప్పాలి.