Begin typing your search above and press return to search.
నాన్ వెజ్ ప్రాణమా? సెక్సు స్టైక్ చేయమని చెప్పి చావు తిట్లు తింటోన్న పెటా
By: Tupaki Desk | 28 Sep 2022 5:12 AM GMTఏం ఉన్నా లేకున్నా.. ముక్క ఉంటే చాలురా భగవంతుడా.. అంతకు మించింది మరొకటి లేదన్నట్లుగా వ్యవహరిస్తుంటారు నాన్ వెజ్ ప్రియులు. అవకాశం ఉండాలే కానీ నిత్యం నాన్ వెజ్ ను భారీగా లాగించటానికి చాలా మంది మక్కువ చూపుతుంటారు.
రోజులు గడిచే కొద్దీ మాంసాహారాన్ని లాగించే వారి సంఖ్య అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటి వారందరికి ఒళ్లు మండేలా.. మంట పుట్టించే మాటను ప్రచారంలోకి తీసుకొచ్చింది పెటా సంస్థ. మూగజీవాల్ని కాపాడటమే లక్ష్యంగా పని చేసే ఈ సంస్థ తీరు మీదా పలు విమర్శలు ఉన్నాయి.
ఇదిలా ఉంటే.. తాజాగా పెటా సంస్థ చేపట్టిన ఒక క్యాంపైన్ విమర్శలు వెల్లువెత్తేలా చేయటమే కాదు.. దాని ప్రకటనపై పలువురు మండిపడుతున్నారు. ముక్క తినే మగాళ్లకు ముద్దు ముచ్చట లేకుండా.. సెక్సుకు దూరం చేయాలన్న ప్రచారాన్ని పెటా షురూ చేసింది. నాన్ వెజ్ తినే మగాళ్లతో రొమాన్స్ చేయొద్దంటూ మహిళా లోకానికి పిలుపునివ్వటాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ఇదెక్కడి పోయే కాలం అంటూ ఫైర్ అవుతున్నారు.
ఎంత మూగ జీవాల హక్కుల సంస్థ అయితే మాత్రం.. ఇలా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబడటం ఏమిటన్న మండిపడుతు వ్యక్తమవుతోంది. తాజాగా పెటా తనబ్లాగులో చేసిన పోస్టుపై మహిళల నుంచి సైతం వ్యతిరేకత వ్యక్తమైంది. చేతిలో బీరు బాటిళ్లు.. ముక్కతో మగవాల్లు ఎంజాయ్ చేస్తున్నారని.. అది మూగజీవులకు హానిగా పేర్కొన్నారు.
"ఈ భూమి పర్యావరణ సమతుల్యం దెబ్బ తినటానికి కారణం మహిళల కంటే పురుషులే ఎక్కువ కారణం. నాన్ వెజ్ తినే మగాళ్లు పర్యావరణ కాలుష్యానికి 41 శాతం కాలుష్యం కావటానికి కారణం. అందుకే వారితో సెక్సుకు స్ట్రైక్ చేయాలి. వారిని వెజిటేరియన్స్ గా మార్చాలి" అంటూ పిలుపునిచ్చింది. దీనిపై పలువురు మండిపడుతున్నారు.
పెటాకు ఇదేం పోయే కాలం? అని కూడా ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రచారంపై సోషల్ మీడియాలోనూ నెగిటివ్ ట్రెండ్ నడుస్తోంది. పాపం.. నాన్ వెజ్ ను లాగించేది అబ్బాయిలే అనుకుంటున్న పెటాకు వాస్తవంలో ఇటీవల కాలంలో అమ్మాయిలు సైతం భారీగా లాగించేస్తున్నారన్న వాస్తవాన్ని మిస్ కావటంతోనే ఇలాంటి ఎదురుదెబ్బగా చెప్పక తప్పదు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.