Begin typing your search above and press return to search.

మాంసం బంద్ చేస్తే ఎంత డేంజరో తెలుసా?

By:  Tupaki Desk   |   5 Sep 2019 4:48 AM GMT
మాంసం బంద్ చేస్తే ఎంత డేంజరో తెలుసా?
X
వారంలో రెండు మూడు సార్లు ముక్కలేనిది గొంతు దిగని వారు చాలా మంది ఉంటారు. దాని వల్ల ఉబకాయం, రోగాలు వచ్చినా మాంసాహారాన్ని మాత్రం వదలరు. చికెన్ - మటన్ - చేపలు - రొయ్యలు ఇలా తమ జిహ్వ చాపల్యాన్ని అణుచుకోకుండా తినేస్తుంటారు. అయితే సడన్ గా రోగాల వల్లో లేక వ్రతాలు - పూజలు - మొక్కుకోవడం వల్లో మాంసం తినడం మానేస్తే అది చాలా డేంజర్ అని బ్రిటన్ పరిశోధకులు తేల్చారు.

ఇంతకాలం మాంసాహారం తిని ఇప్పుడు సడన్ గా శాఖహారిగా మారితే అది చాలా డేంజర్ అని బ్రిటన్ పరిశోధకులు తేల్చారు. దీనివల్ల మీ మెదడు పరితీరు దెబ్బతింటుందని - సమర్థవంతంగా పనిచేయదని స్పష్టం చేశారు. మెదడు బాగా పనిచేసేందుకు అవసరమయ్యే కోలిన్ వంటి పోషకాలు కేవలం మాంసాహారంలోనే ఉంటాయి. శాఖహారిగా మారితే ఈ పోషకాలు అందక మెదడు సరిగా పనిచేయదట.

మాంసం - గుడ్లలోనే కోలిన్ అధికంగా ఉంటుంది. శాఖాహారంలో ఉండదు. ప్రస్తుతం చాలా మంది తమ ఉబకాయానికి మాంసాహారమే చేటు తెస్తుందని బంద్ చేస్తున్నారు. దీనివల్ల వారి మెదడు పనితీరు దెబ్బతింటుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.