Begin typing your search above and press return to search.
పోలీసుల నుంచి తప్పించుకొని షార్క్ బారిన పడ్డాడు!
By: Tupaki Desk | 2 Sep 2017 12:30 AM GMTబ్యాడ్ టైం అంటే ఏంటో చాలా బాగా అర్థం కావాలంటే...ఇదుగో ఈ ఉదంతం గురించి తెలుసుకుంటే చాలు. ట‌్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకోవడానికి అతడు సముద్రంలో దూకాడు. కానీ అతని దురదృష్టం.. అక్కడ వాళ్ల కన్నా డేంజర్ అయిన షార్క్ చేప వెంటపడింది. చివరికి అతను ఎవరిని చూసి భయపడ్డాడో.. వాళ్లే అతన్ని రక్షించాల్సి వచ్చింది. అమెరికాలోని నార్త్ కరోలినా సర్ఫ్ సిటీలో ఈ ఘటన జరిగింది.
20 ఏళ్ల జాచరీ కింగ్స్ బరీకి ఈ అనుభవం ఎదురైంది. విదేశాల నుంచి అక్రమంగా దిగుమతి చేసిన ఓ నిషిద్ధ వస్తువును అతని కారులో చూసిన పోలీసులు.. కింగ్స్ బరీని పట్టుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పోలీసుల నుంచి తప్పించుకోవడానికి పక్కనే ఉన్న బీచ్ లోకి వెళ్లి సముద్రంలో దూకి ఈత కొట్టడం మొదలుపెట్టాడు. మూడు గంటల పాటు అతను అలా ఈత కొట్టిన తర్వాత పోలీసులు అతన్ని గుర్తించి, షార్క్ నుంచి కాపాడి అరెస్ట్ చేశారు. అతని జాడ కనిపెట్టడానికి ఓ డ్రోన్ ను కూడా పోలీసులు రంగంలోకి దించారు. ఈ డ్రోన్ వీడియోను యూట్యూబ్ లో పోస్ట్ చేయగా.. అది వైరల్ అయింది. ఇందులో కింగ్స్ బరీ వెంట ఓ షార్క్ ఉండటం స్పష్టంగా కనిపిస్తున్నది. అప్పుడే చేజ్ కాస్తా అతన్ని రక్షించే ఆపరేషన్ గా మారినట్లు పోలీసులు వెల్లడించారు. అప్పటికే అతను తీరానికి 4 వేల అడుగుల దూరం లోనికి వెళ్లిపోయాడు.