Begin typing your search above and press return to search.
ట్రంప్ ఓ మానసిక రోగి అని ఆ దేశం చెప్పేసింది
By: Tupaki Desk | 23 Jun 2017 10:05 AM GMTఅగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ 'మానసిక రోగి' అంటూ ఉత్తరకొరియా సంచలన వ్యాఖ్యలు చేసింది. అలాంటి వ్యక్తి చెప్పినట్టు దక్షిణకొరియా నడుచుకుంటే...తీవ్ర నష్టాన్ని పొందే ప్రమాదముందని హెచ్చరించింది. ఇటీవల ఉత్తర కొరియా చెర నుంచి విముక్తి పొందిన అమెరికా విద్యార్థి ఒట్టో వాంబియర్ కన్నుమూయడంతో ట్రంప్ మానసిక రోగిగా మారిపోయారంటూ ఉత్తర కొరియా అధికారిక పత్రిక 'రొడోంగ్ సిన్ మున్' ఎడిటోరియల్ కథనం పేర్కొంది.
గూఢచర్యం కేసులో దాదాపు 18 నెలల పాటు కఠినమైన శిక్షను అనుభవించిన ఒట్టోను ఈనెల 13న ఉత్తర కొరియా విడుదల చేసింది. చెర నుంచి విముక్తి పొందిన సమయంలో తీవ్ర అనారోగ్యంతో ఉన్న అతడు వారం రోజుల తర్వాత కన్నుమూశాడు. ఈ ఘటనను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్రంగా ఖండించారు. ``ఉత్తరకొరియాది క్రూరమైన పాలన.. అలాంటి నిరంకుశ వ్యక్తుల చేతుల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరం` అని ట్రంప్ ఆగ్రహం వ్యక్తం చేశారు. వరుస క్షిపణి దాడులు - ఒట్టో వాంబియర్ మృతితో ఉత్తరకొరియా-అమెరికా మధ్య సంబంధాలు బెడిసికొడుతున్నాయి. ఇదే విషయమై దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ కూడా ఉత్తరకొరియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉత్తరకొరియాలో సరైన పాలనలేదని విమర్శించారు.
దక్షిణ కొరియా స్పందన, ఒట్టో మృతి అనంతరం వెలువడ్డ విమర్శలకు పై విధంగా ఉత్తరకొరియా ఘాటుగా స్పందించింది.'ట్రంప్ కఠినమైన పరిస్థితుల్లో ఉన్నారు. ఆ దేశ రాజకీయ సంక్షోభం నుంచి దృష్టిని మళ్లించడానికి ఆయన ఉత్తరకొరియాపై ఆరోపణలు చేస్తున్నారు. ఈ విషయాన్ని దక్షిణకొరియా గ్రహించకపోతే.. పెద్ద విపత్తును ఎదుర్కోవాల్సి వస్తుందని' హెచ్చరిస్తూ తన ఎడిటోరియల్ పత్రికలో రాసుకొచ్చింది. అమెరికా చెప్పినట్టు వెళితే దక్షిణకొరియాకు తీరని నష్టం చేకూరుతుందని ఉత్తరకొరియా తన అధికారిక పత్రిక ద్వారా హెచ్చరించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/