Begin typing your search above and press return to search.
సారీ చెప్పకుంటే ఆ దేశ అధ్యక్ష భవనాన్ని పేల్చేస్తారట
By: Tupaki Desk | 27 March 2016 5:02 PM GMTఇరుగు పొరుగు దేశాల మధ్య ఉండే శత్రుత్వం కొత్తేం కాదు. సరిహద్దు దేశాల మధ్యన నిత్యం ఏదో ఒక పంచాయితీ నడుస్తూనే ఉంటుంది. దాయాది దేశాల తీరుతో ఆయా దేశాలు తీవ్రంగా మండిపడటం కామనే అయినా.. ఉత్తర.. దక్షిణ కొరియాల మధ్య సాగుతున్న పంచాయితీ ఎక్కడకు వెళ్లేలా చేస్తుందన్నది ఇప్పుడు పెద్ద సందేహం మారింది.
తాజాగా దక్షిణ కొరియాకు తీవ్ర హెచ్చరిక చేసింది ఉత్తర కొరియా. ఈ మధ్యనే అణు బలాన్ని సంతరించుకొని.. అవసరమైతే అమెరికాను సైతం ధ్వంసం చేసి పారేస్తామంటూ నోరు పారేసుకుంటున్న ఉత్తర కొరియా.. తన దాయాది దేశమైన దక్షిణ కొరియాకు తీవ్రస్థాయి వార్నింగ్ ఇచ్చింది. తమ దేశంపైకి దాడి చేయాలన్న కుట్ర పన్నుతోందని.. దీనికి సారీ చెబితే సరి.. లేకుంటే ఆ దేశం మీద బాంబులు వేసేస్తామని.. ఆ దేశ అధ్యక్ష భవనాన్ని పేల్చేస్తామని పేర్కొంది.
తమ దాడికి నిరోధించటానికి క్షమాపణ ఒక్కటే మార్గమని.. లేకుంటే ఒక్క మీట నొక్కితే దక్షిణ కొరియా అధ్యక్ష భవనం తునాతునకలవుతుందని ఉత్తర కొరియా హెచ్చరిస్తోంది. తాజాగా వార్నింగ్ తో పాటు.. ఒక వీడియోను విడుదల చేసిన ఉత్తర కొరియా వార్నింగ్ కు దక్షిణ కొరియా ఎలా స్పందిస్తుందన్నది ఇప్పుడు ఉత్కంఠగా మారింది.