Begin typing your search above and press return to search.

వ్యాక్సిన్లా..మాకెందుకు? ఎలా డీల్ చేయాలో తెలుసు: నార్త్ కొరియా

By:  Tupaki Desk   |   4 Sep 2021 11:30 AM GMT
వ్యాక్సిన్లా..మాకెందుకు? ఎలా డీల్ చేయాలో తెలుసు: నార్త్ కొరియా
X
ఒక‌వైపు వ్యాక్సిన్లో మొర్రో అని వివిధ దేశాలు బెంబేలెత్తుతున్నాయి. క‌రోనా ప్ర‌పంచ వ్యాప్తంగా విజృంభ‌ణ నేప‌థ్యంలో.. ఆర్థికంగా స్థితిమంత‌మైన దేశాలు కూడా వ్యాక్సిన్ ల మీద క‌న్నేశాయి. వీలైన‌న్ని వ్యాక్సిన్ల‌ను కొని ప‌డేశాయి. రాబోయే ఏడాదిలో ఉత్ప‌త్తి అయ్యే వ్యాక్సిన్ల‌న్నింటికీ కూడా అడ్వాన్సులు చెల్లించి ప‌లు దేశాలు డోసుల‌ను త‌మ సొంతం చేసుకుంటున్నాయి. ఇక పేద దేశాలు ఆశ‌గా చూస్తున్నాయి. పేద దేశాల‌కు కూడా వ్యాక్సిన్లు అందాలంటూ ఐరాస పిలుపునిస్తోంది. అంద‌రికీ వ్యాక్సిన్లు అందిన‌ప్పుడే అంద‌రికీ సేఫ్ అని త‌ట్టి చెబుతోంది. ఈ విష‌యంలో పెద్ద దేశాలు స్పందిస్తున్నాయి. త‌లా కొన్ని వ్యాక్సిన్ల‌ను డొనేట్ చేస్తున్నాయి. ఈ క్ర‌మంలో నార్త్ కొరియాకు కూడా ముప్పై ల‌క్ష‌ల వ్యాక్సిన్ డోసుల ఆఫ‌ర్ ఒక‌టి వెళ్లింద‌ట‌.

విచిత్ర‌మైన నియంత కిమ్ మాత్రం.. ఆ డోసుల‌ను తిర‌స్క‌రించార‌ట‌. త‌మ‌కు వ్యాక్సిన్ అవ‌స‌రం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టంగా చెప్పార‌ట‌. కావాలంటే ఆ వ్యాక్సిన్ల‌ను అవ‌స‌ర‌మైన ఏవైనా పేద దేశాల‌కు ఇవ్వ‌మ‌ని కూడా ఆయ‌న స‌ల‌హా ఇచ్చేశార‌ట‌!

ఆ కొరియా జ‌నాభాకు ముప్పై ల‌క్ష‌ల డోసులంటే ఎంతో కొంత ఉప‌యోగ‌ప‌డ‌తాయి. అయితే.. కిమ్ ప్ర‌భుత్వం మాత్రం త‌మ‌కు వ్యాక్సిన్లే వ‌ద్ద‌ని అంటోంది. వాటిని ఏదైనా దేశానికి ఇచ్చుకోమ‌ని ఉచిత స‌ల‌హా ఇస్తోంది. అంతే కాదు.. క‌రోనాను ఎలా డీల్ చేయాలో కూడా త‌మ‌కు తెలుస‌ని నార్త్ కొరియ‌న్ ప్ర‌భుత్వం చెప్పింద‌ట‌. క‌రోనాను డీల్ చేయ‌డం తెలిసిన త‌మ‌కు ఇలా మ‌ళ్లీ వ్యాక్సిన్లు ఎందుకంటూ ప్ర‌శ్నించింద‌ట‌. ప్ర‌తి విష‌యంలోనూ విడ్డూరంగా స్పందించ‌డం అల‌వాటుగా మారిన నార్త్ కొరియా ఇలా ఉచితంగా వ‌స్తున్న వ్యాక్సిన్ల‌ను కూడా తిర‌స్క‌రించేయ‌డం గ‌మ‌నార్హం.

ఇప్ప‌టి వ‌ర‌కూ అక్క‌డ క‌రోనా కేసులు ఏ స్థాయిలో వ‌చ్చాయ‌నే అంశంపై కూడా స్ప‌ష్ట‌త లేదు. తమ దేశంలో అస్స‌లు క‌రోనా కేసులు లేవ‌ని గ‌త ఏడాదే నార్త్ కొరియ‌న్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. ప‌క్క‌నున్న సౌత్ కొరియా మాత్రం క‌రోనాను కంట్రోల్ చేయ‌డానికి ర‌క‌ర‌కాల ప్ర‌య‌త్నాలు చేసింది. లాక్ డౌన్లు, క‌ర్ఫ్యూల‌తో క‌రోనాను పూర్తిగా నియంత్రించిన దేశంగా మొద‌ట్లోనే పేరు తెచ్చుకుంది. అయితే నార్త్ కొరియా మాత్రం త‌మ వ‌ద్ద కేసులే లేవంటూ చెప్పుకొస్తోంది. జ‌నాలు ఎలాంటి ఇబ్బందులు ప‌డుతున్నా కిమ్ ప్ర‌భుత్వం ఆ ప‌రిస్థితిని బ‌య‌ట‌ప‌డ‌నివ్వ‌ద‌ని వేరే చెప్ప‌న‌క్క‌ర్లేదు. అంత‌టితో ఆగ‌కుండా.. ఇప్పుడు వ్యాక్సిన్ల‌ను కూడా తిర‌స్క‌రించి కిమ్ త‌న పైత్యాన్ని మ‌రోసారి చాటిన‌ట్టుగా ఉన్నాడు.