Begin typing your search above and press return to search.

కొరియాను మ‌ళ్లీ కెలుకుతున్న అమెరికా

By:  Tupaki Desk   |   25 April 2017 11:15 AM GMT
కొరియాను మ‌ళ్లీ కెలుకుతున్న అమెరికా
X
అమెరికా-ఉత్త‌ర‌ కొరియాల మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితులు ఇంకా స‌ద్దుమ‌ణిగిన‌ట్లు క‌నిపించ‌డం లేదు. తాజాగా అమెరికాకు చెందిన యుద్ధ జ‌లాంత‌ర్గామి ద‌క్షిణా కొరియా తీరానికి చేరుకున్న‌ది. యూఎస్ ఎస్ మిచిగ‌న్ స‌బ్‌ మెరైన్ ప్ర‌స్తుతం బుసన్ తీరంలో ఉంది. మ‌రోవైపు కార్ల్ విన్‌ స‌న్ యుద్ధ నౌక‌ల బృందం కూడా నార్త్ కొరియా దిశ‌గా క‌దులుతున్న విష‌యం తెలిసిందే.

ఇదిలాఉండ‌గా ఇవాళ ఉత్త‌ర కొరియా 85వ వ్య‌వ‌స్థాప‌క సంబ‌రాలు జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఆ దేశం భారీ డ్రిల్ ఏర్పాటు చేసిన‌ట్లు ద‌క్షిణ కొరియా పేర్కొన్న‌ది. మ‌రిన్ని న్యూక్లియ‌ర్ ప‌రీక్ష‌లు చేప‌ట్టేందుకు ఉత్త‌ర కొరియా సిద్ధంగా ఉన్న కార‌ణంగా అమెరికా ద‌ళాలు స‌మాయ‌త్తం అవుతున్నాయి. నార్త్ కొరియా ప్ర‌తి క‌ద‌లిక‌ను ఆర్మీ గుర్తిస్తున్న‌ద‌ని అమెరికా వ‌ర్గాలు వెల్ల‌డించాయి. స‌బ్‌ మెరైన్‌ మిచిగ‌న్ అణ్వాయుధ స‌త్తా క‌ల‌దు. ఆ జ‌లాంత‌ర్గామి సుమారు 154 తోమాహాక్ మిస్సైళ్ల‌ను మోసుకెళ్ల‌గ‌ల‌దు. మ‌రో 60 స్పెష‌ల్ ఆప‌రేష‌న్స్ ట్రూప్స్ కూడా ఉంటాయి.

కాగా, ఒకే ఒక్క దాడితో అమెరికాకు తమ సైనిక శక్తి తడాఖాను చూపడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా ఇప్ప‌టికే హెచ్చరించింది. అమెరికా యుద్ధ విమాన వాహకనౌక కార్ల్‌ విన్సన్‌ ను ఉత్తరకొరియా ప్రాదేశిక జలాల్లోకి వెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధికార వర్కర్స్ పార్టీకి చెందిన పత్రిక అమెరికా యుద్ధనౌకను గడ్డి తినే జంతువుతో పోల్చింది. తాము ఒకే ఒక దెబ్బతో యూఎస్ యుద్ధనౌకను ముంచేస్తామని హెచ్చరించింది. అలాగే అమెరికాను గుడ్డిగా అనుసరిస్తే ఆస్ట్రేలియాపై అణ్వాయుధాలతో దాడి చేస్తామని హెచ్చరించింది. ఉత్తరకొరియా విషయంలో అనుచితంగా నోరు జారే ముందు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆస్ట్రేలియాకు సూచించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/