Begin typing your search above and press return to search.

కిమ్‌ ను లేపేయ‌డ‌మే బెస్ట్‌..అయితే కాస్త ఆగండి

By:  Tupaki Desk   |   1 Oct 2017 6:26 PM GMT
కిమ్‌ ను లేపేయ‌డ‌మే బెస్ట్‌..అయితే కాస్త ఆగండి
X
వరసగా అణు పరీక్షలు నిర్వహిస్తూ ప్రపంచ మానవాళి మనుగడకే సవాలు విసురుతున్న ఉత్తర కొరియా ర‌థ‌సార‌థి కిమ్ జోంగ్ ఉన్ ప్రాణాల‌కు ముప్పు ఉందా? చ‌ర్చ‌లు - దౌత్యప‌ర‌మైన చ‌ర్య‌లు విఫ‌ల‌మైన నేప‌థ్యంలో ఏకంగా ఆయ‌న‌కు స్పాట్ పెట్టేందుకు పొరుగుదేశ‌మైన ద‌క్షిణ కొరియా సిద్ధ‌మైన‌ట్లు తెలుస్తోంది. స‌హ‌జంగానే ఈ చ‌ర్య‌కు అమెరికా ప‌రోక్ష స‌హాయ‌ - స‌హ‌కారాలు అందిస్తున్న‌ట్లు వార్త‌లు వెలువ‌డుతున్నాయి. ఈ మేర‌కు డెయిలీ స్టార్‌ సంచ‌ల‌న‌ క‌థ‌నం వెలువ‌రించింది. గగన - ఉపరితల - జల మార్గాల ద్వారా ఏక కాలంలో కిమ్‌ ప్యాలెస్‌ పై దాడి చేసి అతడిని హత్య చేయాలని భావిస్తున్నట్లు ఆ ప‌త్రిక జోస్యం చెప్పింది.

ఇంతవరకు ఉత్తరకొరియాను మాటల మహమ్మారిగానే ప్రపంచం భావించింది. సమీపంలోని లక్ష్యాన్ని చేధించగలిగే అణుసామర్థ్యాన్ని సముపార్జించుకుందని విశ్వసించింది. ఆగర్భ శతృవు దక్షిణ కొరియాను మాత్రమే ఇది లక్ష్యంగా చేసుకుంటుందని అంచనాలేసింది. అయితే జపాన్‌ గగనతలం మీదుగా ఉత్తరకొరియా క్షిపణులు దూసుకెళ్ళిన తర్వాతగాని ఆ దేశం అణ్వాయుధ శక్తిసామర్ద్యాల్ని ప్రపంచం గుర్తించలేక పోయింది. ఇప్పుడు అమెరికా మిత్రపక్షాలైన జపాన్‌ - దక్షిణకొరియాలతో పాటు ఆస్ట్రేలియా వంటి మరికొన్ని దేశాలపై కూడా ఉత్తర కొరియా దృష్టి పెట్టినట్లు అంతర్జాతీయ సమాజం భావిస్తోంది. కిమ్ చర్యలతో మూడో ప్రపంచ యుద్దం వచ్చే అవకాశాలున్నాయనే అనుమానాలు కూడ బలపడుతున్నాయి. కీల‌క‌మైన ఆర్థిక వ్యవస్థను కుప్పకూల్చేలా ఎలెక్ట్రోమాగ్నటిక్‌ పల్స్‌ (ఈఎంపీ) దాడికి ఆదేశించే అవకాశం ఉందన్న భయం నేపథ్యంలో ఇక అతడిని చంపడంమే మార్గమని దక్షిణ కొరియా భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ నేప‌థ్యంలో ఆయ‌న నివాసంపై దాడి చేసి ఆయ‌న్ను చంపేందుకు ద‌క్షిణ కొరియా ప్ర‌య‌త్నం చేస్తోంద‌ని తెలుస్తోంది.

అయితే ఈ స్కెచ్ అంత ఈజీ కాద‌ని తెలుస్తోంది. ఉత్త‌ర‌కొరియా పాల‌కుడి నివాసంపై గ‌తంలో దాడుల‌కు ప్ర‌య‌త్నించిన ఉదంతాలు ఉన్న్ప‌టికీ...శ‌త్రుదుర్బేధ్య‌మైన ఆయ‌న నివాసంలోకి అడుడుపెట్టి కిమ్‌ ను అంత‌మొందిచ‌డం అంత ఈజీ కాద‌ని అంటున్నారు. అది కేవలం 40శాతం మాత్రమే విజయవంతం అయ్యే అవకాశం ఉందని అంచ‌నా వేస్తున్నారు. అయితే అణుయుద్ధం కంటే కిమ్‌ ను ఆయ నివాసంలోనే తుద‌ముట్టించ‌డం తేలిక అని ఓ బ్రిట‌న్ నిపుణుడు సూచించ‌డం క‌ల‌క‌లం రేపింది. అయితే ఆయ‌న్ను ప్ర‌జాస్వామ్య‌రూపంలోనే గ‌ద్దె దించ‌డం కోసం అమెరికా - ద‌క్షిణ కొరియా - జ‌పాన్‌ లు చైనా పై ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఉత్త‌ర‌ కొరియాతో సుహృద్భావ వాతావ‌ర‌ణంలో ఉన్నందున ఈ ప్ర‌య‌త్నం చేయాల‌ని చైనాను ఈ విష‌యంలో ఈ మూడు దేశాలు ఒత్తిడి చేస్తున్న‌ట్లు తెలుస్తున్న‌ది.