Begin typing your search above and press return to search.

అమెరికాలో ఉత్తరకొరియా అధ్యక్షుడి పాదయాత్ర

By:  Tupaki Desk   |   6 Nov 2017 4:35 PM GMT
అమెరికాలో ఉత్తరకొరియా అధ్యక్షుడి పాదయాత్ర
X
ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ అమెరికాలోని న్యూయార్క్‌ లో రద్దీ వీధుల్లో నడుచుకుంటే వెళ్తే ఏమవుతుంది...? అస్సలు ఇలాంటి పరిస్థితి ఊహించగలమా? అమెరికా - ఉత్తర కొరియాలు ఢీ అంటే ఢీ అంటూ ఎప్పుడు యుద్ధానికి దిగుతాయో తెలియని పరిస్థితుల్లో... అణు యుద్ధం ముంచుకురానుందా అన్న అనుమానాలు భయపెడుతున్న వేళ ఉత్తరకొరియా అధ్యక్షుడు అమెరికాలో హాయిగా నడుచుకుంటూ వెళ్లగలిగే పరిస్థితి ఉంటుందా? కానీ... దాదాపుగా అలాంటి సందర్భమే ఏర్పడింది. అదెలానో తెలుసా..

ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్‌ ను పోలిన ఓ వ్యక్తి న్యూయార్క్‌ లో అచ్చంగా కిమ్ జాంగ్ మాదిరిగానే వేషం వేసుకుని 10 గంటల పాటు వీధుల్లో తిరిగాడు. చాలామంది అతన్ని చూసి ఉత్తర కొరియా అధ్యక్షుడిగా భ్రమపడినా వెంటనే కాదని తెలుసుకున్నారు. కొందరైతే ఆయనతో సెల్ఫీలు దిగడానికి పోటీ పడ్డారు. ఆ వ్యక్తి అక్కడితో ఆగకుండా నేరుగా ట్రంప్ టవర్‌కు వెళ్లి ట్రంప్ ఎక్కడున్నారంటూ అడిగాడట.

అయితే, ఆయన ఇదంతా చేయడానికి కారణం ఉంది. ఒక వీడియో షూట్ చేయడం కోసం ఇలా చేశాడట. ఆరు నిమిషాల నిడివి ఉన్న ఆ వీడియోను యూట్యూబ్ లో అప్ లోడ్ చేయగా ఇప్పటికి 50 లక్షల మందికి పైగా వీక్షించారు.

క్యూపార్క్ పేరుతో పాపులర్ అయిన యూట్యూబర్ ఈ పనిచేశారు. తరచూ ఆయన ఏదో ఒక వేషంలో న్యూయార్క్ లోని హార్లెమ్ - వాల్ స్ర్టీట్ - కొరియా టౌన్ ప్రాంతాల్లో 10 గంటలు పాదయాత్ర చేస్తాడు. అలా తిరుగుతున్నప్పుడు తీసే సరదా వీడియోలను యూట్యూబ్ లో పెడతారు. అమెరికాపై బాంబులేస్తానంటున్న కిమ్ జాంగే కనుక న్యూయార్క్ లో తిరిగితే ఎలా ఉంటుందన్న ఆలోచన ఆయనకు వచ్చింది. ఇంకేముంది అనుకున్నదే తడవుగా అమలు చేసేశారు. అదే ఈ వీడియో.. మీరూ చూడండి.