Begin typing your search above and press return to search.
షాకింగ్!... కిమ్ వైట్ హౌస్‌కే గురి పెట్టాడట!
By: Tupaki Desk | 24 Nov 2017 1:59 PM GMTఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్... ప్రపంచాన్ని సర్వ నాశనం చేసేదాకా నిద్ర పోయేలా కనిపించడం లేదన్న వాదన బలంగా వినిపిస్తోంది. తొలుత అగ్రరాజ్యం అమెరికాపైనే కాలు దువ్విన కిమ్... ఆ తర్వాత అమెరికాకు మద్దతుగా నిలుస్తున్న దేశాలను కూడా లక్ష్యంగా చేసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. గడచిన రెండు మాసాలుగా ఎలాంటి కవ్వింపు చర్యలు లేకుండా కాలం గడిపేసిన కిమ్... తెర వెనుక పెద్ద కసరత్తే చేసినట్లుగా ప్రపంచ దేశాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇప్పటికే వద్దు వదంటున్నా... పదే పదే అణ్వస్త్రాలను పరీక్షిస్తూ కిమ్ ప్రపంచ దేశాల వెన్నులో వణుకు పుట్టిస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే పెద్ద మొత్తంలో అణ్వాయుధాలను తయారు చేసి పెట్టుకున్నట్లుగా కిమ్‌పై ప్రపంచ దేశాలన్నీ అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. మూర్ఖత్వంతో వ్యవహరించే కిమ్.. ఏ క్షణంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడోనని కూడా ఆయా దేశాలు హడలిపోతున్నాయంటే అతిశయోక్తి కాదేమో. సాధారణంగా కిమ్ ఎప్పుడు కూడా సైలెంట్‌గా ఉండే వ్యక్తి కాదనేది విశ్లేషకుల మాట. అయితే గడచిన రెండు నెలలుగా అమెరికా సహా ఏ ఒక్క దేశం మీద కూడా ఎలాంటి వ్యాఖ్య చేయకుండానే కిమ్ కాలం గడిపేశాడు. అసలు అతడికి అనారోగ్యం తిరగబెట్టిందని, బయటకు వచ్చే పరిస్థితి లేదన్న వార్తలు కూడా వినిపించాయి. అయితే ఈ వార్తలన్నీ కూడా ఒట్టి ఊహాగానాలే అని తేలిపోయింది.
బయటకు రాకుండా అండర్ గ్రౌండ్ లోనే ఉండిపోయిన కిమ్... ఈ రెండు నెలల్లో పెద్ద కసరత్తే చేశాడని తాజాగా తేలిపోయింది. ఎప్పుడు సంచలన ప్రకటనలు చేస్తూ ప్రపంచాన్నే వణికిస్తున్న కిమ్ సైలెన్స్ వెనుక ఉన్న అసలు కారణాలేంటన్న కోణంలో ... యూరోపియన్ యూనియన్ ఆఫ్ ఫారిన్ రిలేషన్స్ (ఈయూఎఫ్ఆర్) కాస్తంత లోతుగానే విశ్లేషణ చేసిందట. ఈ విశ్లేషణలో ప్రపంచ దేశాలన్నీ హడలెత్తిపోయే వాస్తవాలు బయటకు వచ్చినట్లుగా ఆ సంస్ధ చెబుతోంది. ఉత్తర కొరియా అధికారిక మీడియా ప్రకటనలు, వార్తలను విశ్లేషించిన తర్వాతే ఈ సంచలన విషయాలు నిగ్గు తేలినట్లుగా ఆ సంస్థ కథనాలు చెబుతున్నాయి. ఈయూఎఫ్ఆర్ విశ్లేషణ ప్రకారం... అమెరికా సహా జపాన్ - దక్షిణ కొరియా - గ్వామ్ ద్వీపాలనే లక్ష్యంగా చేసుకుని దాడులు చేసేందుకు కిమ్ పక్కా స్కెచ్ రెడీ చేసుకున్నా డట. దక్షిణ కొరియాను మొదటి నుంచి శత్రు దేశంగానే చూస్తున్న కిమ్... ఆ దేశంపై గురి పెట్టాడంటే పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేకున్నా... ఆ దేశానికి మద్దతుగా నిలిచిందన్న ఒకే ఒక్క కారణంతో అమెరికాపైకీ కిమ్ కాలు దువ్వాడు. ఇక జపాన్ పై అతడి గురి కూడా ఆ కోవలోనిదేనని చెప్పాలి. ఇప్పుడు ఈ దేశాలను టార్గెట్ చేసిన కిమ్... ఆ దేశాల్లో తన లక్ష్యాలను కూడా మార్క్ చేసుకున్నాడట.
మొత్తం 15 లక్ష్యాలను ఎంచుకున్న కిమ్... వాటిలో ఉన్న నగరాలు, ప్రదేశాలపై పక్కా స్కెచ్ రెడీ చేసుకున్నాడట. అయినా కిమ్ ఎంచుకున్న లక్ష్యాల విషయానికి వస్తే... అమెరికా అధ్యక్ష భవనం వైట్ హౌస్‌ను కిమ్ తన లక్ష్యంగా ఎంచుకోవడం ఇప్పుడు అత్యంత ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రపంచంలోనే అత్యంత కట్టుదిట్టమైన భద్రత కలిగిన భవనాల్లో ముందు వరుసలో ఉన్న వైట్ హౌస్‌నే కిమ్ ఎంచుకున్నాడంటే అతడు ఏ మేర విధ్వంసం సృష్టించగలడో ఇట్టే చెప్పేయొచ్చు. వైట్ హౌస్‌తో పాటు ఇతర లక్ష్యాలేంటన్న విషయానికి వస్తే... పెంటగాన్, న్యూయార్క్, మన్‌హట్టన్‌తో పాటు అమెరికా ముఖ్య నగరాలలో అణు దాడులకు పాల్పడే అవకాశం ఉందని తెలుస్తోంది. జపాన్‌లోని మిసావా - టొక్యో - ఒసాకా - యోకోహామా - క్యోటో నగరాలపై దాడులు చేయాలని ప్లాన్ చేశాడట. దక్షిణ కొరియాలోని సియోల్, బుసాన్, గ్యాంన్నెయంగ్ ప్రాంతాల్లో కిమ్ దాడులు చేసే అవకాశం ఉందని ఈయూఎఫ్ఆర్ నివేదిక భావిస్తోంది.