Begin typing your search above and press return to search.
ట్రంప్ కు షాక్..మూడు మిస్సైళ్లను పరీక్షించిన కిమ్
By: Tupaki Desk | 26 Aug 2017 12:29 PM GMTఅమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ట్రంప్‌కు దిమ్మతిరిగే షాక్ తగిలింది. ఇటీవలి వరకూ ఉత్తరకొరియాపై నిప్పులు చెరిగిన ట్రంప్ రెండ్రోజుల క్రితం మీడియాతో మాట్లాడుతూ తన హెచ్చరికలకు ఉత్తరకొరియా భయపడి, మెత్తపడిందంటూ జబ్బలు చరుచుకున్నారు. అయితే, ఆయన ఆ మాటలన్న కొన్ని గంటల్లోనే ఉత్తరకొరియా తాను మెత్తబడిందేమీ లేదని స్పష్టం చేసింది. క్షిపణుల తయారీని మరింత వేగవంతం చేయాలని, క్షిపణుల్లో అమర్చేందుకు మరిన్ని అణుబాంబులు తయారు చేయాలని శాస్త్రవేత్తలను ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ ఆదేశించారు. అన్నట్లుగానే మరుసటి రోజు ఉత్తర కొరియా క్షిపణులను ప్రయోగించింది.
మూడు షార్ట్ రేంజ్ మిస్సైళ్లను నార్త్ కొరియా ఇవాళ పరీక్షించిందని యూఎస్ పసిఫిక్ కమాండ్ ప్రకటించింది. కాంగ్వాన్ ప్రావిన్సు నుంచి నార్త్ కొరియా మూడు క్షిపణులను ప్రయోగించిందని తెలిపారు. మొదట మిస్సైళ్ల ప్రయోగం విఫలమైనట్లు అమెరికా పేర్కొన్నా, ఆ తర్వాత తమ స్టేట్ మెంట్ ను మార్చేశారు. మూడు మిస్సైళ్లు సుమారు ఈశాన్యం దిశగా 250 కిలోమీటర్లు ప్రయాణించాయని పసిఫిక్ కమాండ్ పేర్కొంది.
అరిజోనాలోని ఫీనిక్స్ లో జరిగిన బహిరంగసభలో ట్రంప్ మాట్లాడుతూ.. ఉత్తరకొరియా ఇటీవల సానుకూల సంకేతాలు వెలువరిస్తోందని చెప్పారు. ``ఉత్తరకొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ మనల్ని గౌరవించడం ప్రారంభించారు.. నేనూ దీన్ని గౌరవిస్తున్నాను`` అని తెలిపారు. అయితే, ట్రంప్ మాటల్ని పట్టించుకోకుండా ఉత్తరకొరియా తనదైన ధోరణిలో క్షిపణుల తయారీని మరింత వేగవంతం చేసింది. రక్షణశాస్ర్తాల అకాడమీని సందర్శించిన కిమ్ మరిన్ని క్షిపణులను, వాటిలో అర్చేందుకు మరిన్ని అణుబాంబులను తయారు చేయాలని శాస్త్రవేత్తలను ఆదేశించినట్టు ఉత్తరకొరియా వార్తాసంస్థ కేసీఎన్ ఏ వెల్లడించింది. ఆ మరుసటి రోజే ఈ పరీక్షలు జరగడం ఆసక్తికరం.