Begin typing your search above and press return to search.
ఉత్తరకొరియా అణుపరీక్షతో కొండలు విరిగిపడ్డాయి
By: Tupaki Desk | 6 Sep 2017 11:47 AM GMTఅగ్రరాజ్యం అమెరికాపై తనదైన శైలిలో బెదిరింపులకు పాల్పడుతున్న నార్త్ కొరియా చర్యల మూలంగా జరుగుతున్న చర్యలకు మరో నిదర్శనం ఇది. గడిచిన ఆదివారం ఉత్తర కొరియా అణు పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. పంగయి రీ పర్వత శ్రేణుల్లో ఈ పరీక్ష జరిగింది. ఈ హైడ్రోజన్ బాంబు పరీక్ష వల్ల కొండచరియలు విరిగిపడ్డట్లు తెలుస్తోంది. పరీక్ష నిర్వహించిన తర్వాత తీసిన శాటిలైట్ ఇమేజ్ ల ఆధారంగా ఈ విషయం అంచనా వేస్తున్నారు.
ఈ అణుబాంబు పరీక్షపై 38 నార్త్ అనే విశ్లేషణ సంస్థ కొన్ని విషయాలను వెల్లడించింది. ఆ సంస్థ పరీక్ష తర్వాత చోటుచేసుకున్న మార్పులను చూపిస్తూ కొన్ని ఫోటోలను ప్రచురించింది. గతంలో పరీక్షలు నిర్వహించిన దాని కన్నా ఈసారి ప్రకంపనలు ఎక్కువగా ఉన్నట్లు ఆ సంస్థ పేర్కొంది. అణు పరీక్ష వల్ల సుమారు 6.3 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అనుమానిస్తున్నారు. బాంబు పేలుడు తీవ్రత వల్ల చైనా బోర్డర్ దగ్గర కూడా భూప్రకంపనలు చోటుచేసుకున్నాయని తేల్చారు. నార్త్ కొరియా ఇప్పటివరకు ఆరు సార్లు న్యూక్లియర్ టెస్టులు నిర్వహించింది. అవన్నీ పంగయి రీ పర్వతాల్లోనే జరిగాయి. ఈ పర్వతాల్లోనే అనేక టన్నెళ్లు కూడా ఉన్నట్లు అధికారులు చెప్పారు. తాజాగా జరిపిన పరీక్ష వల్ల అనేక చోట్ల భూ ప్రకంపనలు కలిగాయని, దాని వల్ల కొండచరియలు కూడా విరిగిపడినట్లు 38 నార్త్ పేర్కొంది. బలమైన షాక్ వేవ్స్ వల్ల కొండలు ఎగిసిపడినట్లు తెలుస్తున్నది. అయితే పైకిగి ఎగిరిన మట్టి పెళ్లలు మళ్లీ అదే స్థానంలో పడినట్లు అంచనా వేస్తున్నారు. మౌంట్ మన్ టప్ దగ్గర కొండచరియలు విరిగిపడిన ఘటనలు ఎక్కువగా ఉన్నట్లు అనుమానిస్తున్నారు.
మరోవైపు క్షిపణుల ప్రయోగం - అణు బాంబు బెదిరింపుల ద్వారా ఉత్తర కొరియా ‘యుద్ధం ఏర్పడేలా’ అపసవ్యాలకు దిగుతోందని ఐక్యరాజ్య సమితిలో అమెరికా రాయబారి నిక్కీ హేలీ వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాపై సాధ్యమైనంత కఠిన చర్యలు తీసుకొనేలా ఆ దేశ ఆరవ అణుపాటవ పరీక్ష ఉందని ఆమె అన్నారు. ఉత్తర కొరియా నేత కిమ్ జోంగ్ ఉన్ చర్యలు ఆత్మరక్షణ కోసం ఎంతమాత్రం కాదని, అణ్వాయుధ దేశంగా గుర్తింపు పొందాలనే తహతహ ఆయన అణుపాటవ పరీక్షల్లో కనపడుతోందని హేలీ అన్నారు. అణ్వాయుధ దేశమంటే ఇతర దేశాలను ఆ ఆయుధాలతో బెదిరించేది కాదని కూడా వ్యాఖ్యానించారు. ఉత్తర కొరియాపై జరిగిన భద్రతా మండలి సమావేశంలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు.త్వరలో అమెరికా ఈ అంశంపై తీర్మానం ముసాయిదాను రూపొందిస్తున్నట్లు హేలీ చెప్పారు. సెప్టెంబర్ 11 సోమవారం నాటికి అది ఆమోదం పొందేలా రూపొందుతోందని తెలిపారు. భారత సంతతికి చెందిన ఆమె కిమ్ చర్యలు యుద్ధాన్ని తెచ్చేవిగా ఉన్నాయని విమర్శించారు.
మరోవైపు ఉత్తర కొరియా అత్యంత ప్రమాదకర పరిస్థితిని కల్పిస్తోందని సమితిలో బ్రిటీష్ రాయబారి రికాఫ్ట్ విమర్శించారు. భద్రతా మండలిలోని ఇతర దేశాలతో కలిసి తమ దేశం ఈ సవాలు పరిష్కారానికి కృషి చేస్తుందని చెప్పారు. ఉత్తర కొరియా కయ్యానికి కాలుదువ్వుతోందని జపాన్ రాయబారి కోరో బెషో పేర్కొన్నారు. ప్రపంచ దేశాలు ఐక్యమత్యంతో ఆ ప్రమాదాన్ని ఎదుర్కోవాలని సూచించారు. అంతర్జాతీయ ఒత్తిళ్లను పట్టించుకొని తక్షణమే తన వైఖరిని మార్చుకోవాలని ఉత్తర కొరియాను చై నా కోరింది. ఆ దేశపు రాయబారి లీయు జీఈ కొరియా ద్వీపకల్పంలో ఉద్రిక్తతలు పెరిగాయని విచారం వ్యక్తం చేశారు. యుద్ధం రావడాన్ని ఎట్టి పరిస్థితిలో చైనా ఒప్పుకోదని చెప్పారు. ఉత్తర కొరియా తీవ్ర కవ్వింపునకు దీటుగా భద్రతామండలి ప్రతిస్పందించాలని దక్షిణ కొరి యా రాయబారి చో తేయుల్ సూచించారు.