Begin typing your search above and press return to search.
ఉత్తర కొరియా మనకు శత్రువా..మిత్ర దేశమా?
By: Tupaki Desk | 7 Sep 2017 12:30 AM GMTప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారత్...
అందరికీ వ్యతిరేకి అయి అల్లరిపిల్లాడిలా ఏకాకి అయిన దేశం ఉత్తర కొరియా.
మరి.. ఇలాంటి రెండు దేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయో తెలుసా...?
అగ్రరాజ్యం అమెరికాను ఢీకొంటూ ముచ్చెమటలు పోయిస్తున్న ఉత్తరకొరియా మనదేశంతో చెలిమి చేస్తోందా.. లేదంటే మనల్నీ శత్రువుగానే చూస్తోందా..?
అమెరికాతో పాటు ఆ దేశానికి మిత్రులైన దక్షిణ కొరియా - జపాన్ వంటివన్నీ ఉత్తరకొరియా నుంచి ముప్పు ఎదుర్కొంటున్న తరుణంలో అమెరికాతో మంచి సంబంధాలే ఉన్న మన పరిస్థితి ఏంటి?
నిజానికి గతంలో భారత్ - ఉత్తరకొరియాల మధ్య చిన్నపాటి అనుమానాలు - స్పర్థలు పొడసూపిన మాట వాస్తవమే. పాకిస్థాన్ కు ఉత్తర కొరియా అణు సాంకేతికతను అమ్ముతోందని గతంలో మన దేశం ఆరోపించింది. అలాగే... మన వాణిజ్య భాగస్వామ్యుల్లో దక్షిణ కొరియా అయిదో స్థానంలో ఉండడం.. వాణిజ్య కారణాలతో మనకు - దక్షిణ కొరియాకు మధ్య సంబంధాలు బలపడుతుండడం పైనా ఉత్తర కొరియా ఆందోళన వ్యక్తం చేసింది. ఈ కారణాల వల్ల రెండు దేశాల సంబంధాల మధ్య కొంత ప్రతిష్టంబన కూడా ఏర్పడింది.
కానీ... పరిస్థితులు మళ్లీ సర్దుకున్నాయి. ‘‘ఉత్తర కొరియా ఒక స్వతంత్ర దేశం.. పైగా అది ఐరాసలో సభ్యదేశం. గత పరిణామాలు - అనుమానాలు మా మధ్య ద్వైపాక్షిక సంబంధాలకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవు’ అని గత ఏడాది మన హోం శాఖ సహాయ మంత్రి కిరణ్ రిజిజు ప్రకటించిన విషయం కూడా మర్చిపోకూడదు.
అయితే, మన దేశం అంతర్జాతీయ కట్టుబాట్ల ప్రకారం వ్యవహరిస్తూ కొన్ని విషయాల్లో నార్త్ కొరియా పట్ల కఠినంగా ఉంటున్నా కొన్ని విషయాల్లో మాత్రం సహకార ధోరణిలో ఉంది. భద్రతా మండలి తీర్మానాల ప్రకారం ఉత్తరకొరియా సైనిక సామర్థ్యం పెరగడానికి దోహదపడే వస్తువుల సరఫరా నిలిపివేస్తోంది. ఆహారం, మందులు మాత్రం ఇస్తోంది. అదే సమయంలో వర్ధమాన దేశాలకు సంబంధించి.. మన దేశ టెక్నికల్ - ఎకనమికల్ కోపరేషన్ ప్రోగ్రాంలో ఉత్తర కొరియాకు స్థానమిచ్చాం. అంతేకాదు... మహారాష్ట్రలోని లాంగ్వేజ్ ట్రైనింగ్ స్కూల్ - మధ్యప్రదేశ్ లోని పంచమరి ఆర్మీ ఎడ్యుకేషన్ సెంటర్ లో ఉత్తర కొరియా సైనికులు - అధికారులు శిక్షణ కూడా పొందారు.
రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యమూ ఉంది. 2015-16లో మన నుంచి ఉ.కొరియాకు 11 కోట్ల డాలర్ల ఎగుమతులు జరగ్గా.. 9 కోట్ల మేర దిగుమతులు చేసుకున్నాం.
అంతేకాదు... తీవ్ర ఆంక్షలు ఎదుర్కొంటున్న ఉ.కొరియాకు భారత్ నుంచి మానవతా కోణంలో సహాయం అందుతోంది. 2002లో మన దేశం ఉ.కొరియాకు 2 వేల టన్నుల బియ్యం పంపించింది. 2004లో వెయ్యిటన్నులు - 2006లో మరో 2 వేల టన్నుల బియ్యం పంపించింది. 2011 - 2016లో 20 లక్షల డాలర్ల విలువైన ఆహార పదార్థాలను సాయంగా పంపించాం. ఉత్తర కొరియాలో ఒక ఫ్రెండ్ షిప్ స్కూల్ - వ్యవసాయ క్షేత్రం - షూ ఫ్యాక్టరీని భారత్ నడుపుతోంది.
కొరియా-ఇండియా ఫ్రెండ్ షిప్ అసోసియేషన్ కూడా ఒకటుంది. దీనికి గత ఏడాది మన ప్రభుత్వం రూ.5 లక్షల నిధులు మంజూరు చేసింది. రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలూ బాగానే ఉన్నాయి. అక్కడ నిర్వహించే ఫిలింఫెస్టివల్ లో మన చిత్రాలు ప్రదర్శిస్తున్నాం.
ఉత్తర కొరియా కూడా మన పట్ల అంతే సుహృద్భావంతో వ్యవహరించిన సందర్భాలున్నాయి. 2004లో సునామీ వచ్చినప్పుడు ప్రధానమంత్రి సహాయ నిధికి ఉత్తర కొరియా 30 వేల డాలర్ల విరాళం ఇచ్చింది.
అయితే... ప్రపంచ దేశాలన్నీ భయపడుతున్నట్లే మనకూ కొన్ని భయాలున్నాయి. అందుకు కారణాలున్నాయి. నార్త్ కొరియాకు చెందిన తైపొడాంగ్-2 మిసైల్ రేంజి 10 వేల కి.మీ. ఇండియా-నార్త్ కొరియాల మధ్య ఏరియల్ డిస్టెన్స్ 5,073 కిలోమీటర్లు. అంటే, మనం ఉత్తర కొరియా క్షిపణుల రేంజిలో ఉన్నట్లే.