Begin typing your search above and press return to search.
షరతులు మాకు చెల్లవు..అమెరికానే దిగిరావాలి
By: Tupaki Desk | 31 Dec 2017 7:14 AM GMTఅమెరికా - ఉత్తరకొరియా విషయంలో నెలకొన్న వాదోపవాదాల పంచాయతీలో మరో పర్వం తెరమీదకు వచ్చింది. తాజాగా ఉత్తరకొరియా తానెంటో తేల్చి చెప్పింది. ఉత్తరకొరియాను అణచివేసేందుకు అమెరికా తీవ్రంగా శ్రమిస్తోంది. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి కూడా ఆ దేశంపై పలు ఆంక్షలు తీసుకొచ్చింది. ఈనేపథ్యంలో ఉత్తరకొరియా విస్పష్టమైన క్లారిటీ ఇచ్చింది. అమెరికా తీరు మారకుండా, తమ విధానాలు మారవని ఉ.కొరియా తాజాగా స్పష్టం చేసింది. 2018లో కూడా తమ అణు కార్యక్రమం కొనసాగుతుందని తెలిపింది.
ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే 'కొరియన్ సెంట్రల్ న్యూస్ ఏజెన్సీ' (కేసీఎన్ ఏ) శనివారం ప్రచురించిన ఆర్టికల్ లో పై విషయాన్ని తెలియజేసింది. అమెరికా బలప్రయోగం తమను ప్రభావితం చేయలేదని, 2018లోనూ తమ దేశం అణుశక్తి అభివృద్ధికి కట్టుబడి ఉంటుందని ఉ.కొరియా స్పష్టం చేసింది. ''ఉత్తరకొరియా విధానాల్లో ఎలాంటి మార్పులను అంచనా వేయకండి. మా స్వాతంత్య్రంపై ఏ అధికార బలం పనిచేయదు. ఏ శక్తి మమ్మల్ని బలహీనపరచలేదు. అణు సంపత్తిగా ఎదుగుతున్న ఉత్తరకొరియా తమ అభివృద్ధికి కట్టుబడి ఉంటుంది. అమెరికా, దాని అనుబంధ దేశాల నుంచి అణు ముప్పు ఉన్నంతకాలం మేం మా అణ్వాయుధాలను అభివృద్ధి చేస్తూనే ఉంటాం'' అని కేసీఎన్ ఏ ఆర్టికల్ తేల్చిచెప్పింది.
2017లో ఉత్తరకొరియా వరుస క్షిపణి ప్రయోగాలు చేసిన విషయం తెలిసిందే. చివరిసారిగా నవంబర్ 29న అతి శక్తిమంతమైన ఖండాంతర క్షిపణిని ప్రయోగించింది. దాదాపు రెండు నెలల పాటు మౌనంగా ఉన్న ఉత్తరకొరియా నవంబర్‌లో ఈ భారీ ప్రయోగాన్ని చేపట్టింది. ఈ ప్రయోగంంతో అమెరికా ప్రధాన భూభాగమంతా తమ లక్ష్యం పరిధిలోకి వచ్చిందని ఆ సమయంలో ఉత్తరకొరియా పేర్కొంది. దీంతో అమెరికా ఉలిక్కిపడింది. అప్పటి నుంచి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉత్తరకొరియాపై ఒత్తిడి పెంచేందుకు సిద్ధమవుతోంది.
కాగా, ఐక్యరాజ్యసమితి ఆంక్షలను తోసిరాజని ఉత్తరకొరియాకు చమురు పంపించడానికి చైనా సహకరించిందని మీడియా కథనాలను ఉటంకిస్తూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేసిన ఆరోపణలను చైనా తోసిపుచ్చింది. ''చైనా పట్టుబడింది. ఉత్తరకొరియాకు చమురు వెళ్లేలా చైనా సహకరించడంపట్ల తీవ్ర నిరాశకు గురయ్యా'' అని ట్రంప్ గురువారం ట్వీట్ చేశారు. ఇలాంటి చర్య కొనసాగితే ఉత్తరకొరియా సమస్యకు స్నేహపూరిత పరిష్కారం ఉండదని ట్రంప్ అన్నారు. ఈ అంశానికి సంబంధించి ఇటీవల మీడియాలో వచ్చిన కథనాలు వాస్తవ విరుద్ధమని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి హువా చునియాంగ్ స్పష్టం చేశారు. ఐక్యరాజ్యసమితి ఆంక్షలను చైనా ఉల్లంఘించదని, తమ దేశ పౌరులు - సంస్థలను కూడా అలాంటి పనుల్లో పాలుపంచుకోనివ్వదని హువా చెప్పారు. ఉత్తరకొరియా నౌకలోకి చైనా నౌక నుంచి చమురు చేరవేసినట్టు వచ్చిన కథనాన్ని చైనా చూసిందని, ఆ కథనం అవాస్తవమని చెప్పారు. మీడియా ద్వారా అర్థం పర్థం లేని అతిశయాన్ని కల్పించడం వల్ల పరస్పర విశ్వాసం - సహకారానికి తగిన వాతావరణం ఏర్పడదని ఆయన స్పష్టం చేశారు.