Begin typing your search above and press return to search.

అమెరికా..మాతో పెట్టుకుంటే అణుదాడే!

By:  Tupaki Desk   |   24 April 2017 6:09 AM GMT
అమెరికా..మాతో పెట్టుకుంటే అణుదాడే!
X
అగ్ర‌రాజ్యం అమెరికా - న్యూక్లియ‌ర్ సూప‌ర్ ప‌వ‌ర్ హోదా పొందిన ఉత్త‌ర‌కొరియా మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త‌లు ఇంకా స‌ద్దుమ‌ణగ‌లేదు. పైపెచ్చు ఇంకా ముదురుతున్న‌ట్లు క‌నిపిస్తోంది. ఇందుకు నిద‌ర్శ‌నం అన్న‌ట్లుగా తాజాగా ఉత్త‌ర‌కొరియా గ‌ట్టి వార్నింగ్ ఇచ్చింది. అమెరికా త‌మ‌ను కెలికితే చూస్తూ ఊరుకునేది లేద‌ని అదే రీతిలో గట్టి రిప్లై ఇస్తామ‌ని స్ప‌ష్టం చేసింది. ఒకే ఒక్క దాడితో అమెరికాకు తమ సైనిక శక్తి తడాఖాను చూపడానికి సిద్ధంగా ఉన్నామని ఉత్తరకొరియా హెచ్చరించింది.

అమెరికా యుద్ధ విమాన వాహకనౌక కార్ల్‌ విన్సన్‌ ను ఉత్తరకొరియా ప్రాదేశిక జలాల్లోకి వెళ్లేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుమతి ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఉత్తరకొరియా అధికార వర్కర్స్ పార్టీకి చెందిన రోడొంగ్ సిన్‌మన్ పత్రిక అమెరికా యుద్ధనౌకను గడ్డి తినే జంతువుతో పోల్చి ఎద్దేవా చేసింది. అదే స‌మ‌యంలో త‌మ ఆగ్ర‌హాన్ని వ్య‌క్తం చేసింది. తాము ఒకే ఒక దెబ్బతో యూఎస్ యుద్ధనౌకను ముంచేస్తామని హెచ్చరించింది. అవ‌స‌ర‌మైతే ఆ దేశం విష‌యంలో త‌మ అణ్వ‌స్త్ర సామ‌ర్థ్యాన్ని ప్ర‌ద‌ర్శించింది. అలాగే అమెరికాను గుడ్డిగా అనుసరిస్తే ఆస్ట్రేలియాపై అణ్వాయుధాలతో దాడి చేస్తామని హెచ్చరించింది. త‌మ దేశం విషయంలో అనుచితంగా నోరు జారే ముందు ఒక్కటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రిని ఉత్తరకొరియా హెచ్చరించింది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/