Begin typing your search above and press return to search.
ఉత్తర కొరియాకు దిమ్మతిరిగే షాకిచ్చిన ఆ రెండు దేశాలు!
By: Tupaki Desk | 5 Oct 2022 11:30 PM GMTతమ హెచ్చరికలు, ఆంక్షలు, అభ్యంతరాలు లెక్కపెట్టకుండా వరుస క్షిపణి ప్రయోగాలతో తమకు ఏకుకు మేకులా మారిన ఉత్తర కొరియాకు అమెరికా, దాని మిత్ర దేశం దక్షిణ కొరియా దిమ్మతిరిగే షాకిచ్చాయి.
అమెరికా ప్రధాన భూభాగాన్ని, అమెరికా ఆధ్వర్యంలోని గువామ్ ద్వీపాన్ని చేరుకునేలా అక్టోబర్ 4న ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించిన సంగతి తెలిసిందే. ఈ క్షిపణి తమ దేశ ఉత్తర ప్రాంత ద్వీపం హొక్కాయ్‌డో రాజధాని సప్పొరో నగరానికి సమీపంలో పసిఫిక్ సముద్రంలో పడినట్లు జపాన్ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలో హొక్కాయ్‌డో, అమోరి ప్రాంతాలకు రైళ్లను ఆపేసింది. 2017 తర్వాత తొలిసారి ఆ ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసింది.
ఉత్తర కొరియా క్షిపణి ప్రయోగంపై ఆ దేశ సరిహద్దు దేశాలైన జపాన్, దక్షిణ కొరియాలతోపాటు ఉత్తర కొరియా శత్రు దేశం అమెరికా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. అంతేకాకుండా ఉత్తర కొరియాకు కౌంటర్‌గా ఆ దేశం క్షిపణిని ప్రయోగించిన 24 గంటలలోపే అమెరికా, దక్షిణ కొరియా సంయుక్తంగా క్షిపణి ప్రయోగాలు చేపట్టాయి. ఈ రెండు దేశాలు కలిసి ప్రయోగించిన క్షిపణులు కొరియా సముద్ర జలాల్లో పడ్డాయి. తద్వారా ఉత్తర కొరియాకు ఈ రెండు దేశాలు ఘాటు హెచ్చరికలు జారీ చేశాయి.
24 గంటల వ్యవధిలో రెండుసార్లు క్షిపణులను కొరియన్ సముద్ర జలాల్లోకి ఈ రెండు దేశాల సంధించాయి. రెండు మిస్సైళ్లు చొప్పున మొత్తం నాలుగింటిని ప్రయోగించాయి. నిర్దేశిత లక్ష్యాన్ని ఈ నాలుగు మిస్సైళ్లు ఛేదించాయి. దక్షిణ కొరియా కాలమానం ప్రకారం మంగళ, బుధవారాల్లో తెల్లవారు జామున ఈ ప్రయోగం చోటు చేసుకుందని తెలుస్తోంది.
క్షిపణి ప్రయోగాలతోనే ఆగని దక్షిణ కొరియా జెట్ ఫైటర్లను కూడా రంగంలోకి దింపింది. ఎఫ్-15కే ఫైటర్ జెట్లను రంగంలోకి దించింది. ఇవి ఆకాశం నుంచి ఉపరితలంపై లక్ష్యాలను ఛేదించగలవు. కాగా అమెరికా, దక్షిణ కొరియా ప్రయోగించిన క్షిపణుల్లో అత్యంత శక్తిమంతమైన ఎంజీఎం-140 ఆర్మీ టెక్నికల్ మిస్సైల్ సిస్టమ్ కూడా ఉంది. దీన్ని అమెరికా అభివృద్ధి చేసింది. ఈ వ్యవస్థకు చెందిన నాలుగు క్షిపణులనే అమెరికా, దక్షిణ కొరియా.. కొరియా సముద్రంలోకి ప్రయోగించాయి.
ఉపరితలం నుంచి ఉపరితలానికి 320 కిలోమీటర్ల దూరం ఉన్న లక్ష్యాలను ఛేదించగల సామర్థ్యం ఈ ఆర్మీ టెక్నికల్ మిస్సైల్స్‌కు ఉంటుందని అంటున్నారు. ఈ క్షిపణి ప్రయోగాలు, విన్యాసాలను అమెరికా ధ్రువీకరించింది. అమెరికా జాతీయ భద్రత సలహాదారు జాన్ కిర్బీ ఈ మేరకు ఒక ప్రకటన కూడా విడుదల చేశారు.
కాగా ఉత్తర కొరియా ప్రయోగించిన ఈ క్షిపణి.. 4,500 నుంచి 4,600 కి.మీ. ప్రయాణించినట్లు దక్షిణ కొరియా, జపాన్ అంచనా వేశాయి. ఉత్తర కొరియా క్షిపణి మధ్యంతర లేదా దీర్ఘ శ్రేణి క్షిపణి అయి ఉంటుందని జపాన్ తెలిపింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.