Begin typing your search above and press return to search.
కొరియా కాదది కొరివి దెయ్యం
By: Tupaki Desk | 6 Jan 2016 11:20 AM GMTఅణుబాంబు కంటే అత్యంత వినాశకరమైన హైడ్రోజన్ బాంబును తయారు చేసి ప్రయోగించి మరీ చూసింది ఉత్తర కొరియా. ఈ పరీక్ష విజయవంతమైందని ఉత్తర కొరియా బుధవారం ప్రకటించింది. మరోవైపు ఈ ప్రయోగం కారణంగా కొరియాలో భూకంపం సంభవించింది. ఈ భూకంపం కృత్రిమంగా కలిగిందని కొరియా వాతావరణ శాఖ - దక్షిణ కొరియా వాతావరణ సంస్థలు పేర్కొన్నాయి. ఉత్తర కొరియా అణుబాంబుల పరీక్షాకేంద్రానికి సమీపంలోని ఉత్తర కిల్జుకు 49 కిలోమీటర్ల దూరంలో ఈ భూకంపం ఏర్పడిందని వాతావరణ శాఖ పేర్కొంది. గత డిసెంబర్ నెలలో ఉత్తర కొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తమ దేశం హైడ్రోజన్ బాంబును తయారు చేస్తోందని ప్రకటించారు.
హైడ్రోజన్ బాంబు ప్రయోగంతో కొరియా సరిహద్దుల్లో వచ్చిన భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.1గా నమోదైంది. దీంతో ఈ బాంబు ఎంత తీవ్రమైందో ప్రపంచానికి అర్థమైంది. అంతకముందు ఉత్తరకొరియాలో భూకంపం వచ్చినట్లుగా వార్తలు రావడంతో అది అణ్వస్త్ర పరీక్ష అని చైనా అధికారులను అనుమానించారు. ఉత్తర కొరియా ఉన్న ప్రాంతాన్ని బట్టి భూకంపాలు సంభవించే అవకాశం తక్కువ కావడం మిగతా దేశాలూ అదే అనుమానం వ్యక్తంచేశాయి.
అంతర్జాతీయంగా దీనిపై పెద్ద స్థాయిలో చర్చ మొదలవ్వడంతో చివరకు ఉత్తరకొరియానే హైడ్రోజన్ బాంబును పరీక్షించినట్లు ప్రకటించింది.
ఇటీవలి కాలంలో అగ్రరాజ్యమైన అమెరికాను సైతం సవాలు చేస్తున్న ఉత్తరకొరియా ఏకంగా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం చైనా - జపాన్ దేశాలకు ఆందోళన కలిగిస్తోంది. 2013లో భూగర్భంలో అణు పరీక్షలు విజయవంతంగా పరీక్షించిన ఉత్తర కొరియా హైడ్రోజన్ బాంబును పరీక్షించడం ఇదే తొలిసారి. ఈ హైడ్రోజన్ బాంబును పరీక్షించడం వల్ల 5.1 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు యూఎస్ జియోలాజికల్ సర్వే సంస్థ బుధవారం ఉదయం వెల్లడించింది. సుంగ్జిబీగమ్ ప్రాంతానికి 19 కిలోమీటర్ల తూర్పు ఈశాన్య దిశలో ఈ భూకంప కేంద్రం ఉంది. ఉత్తర కొరియా విజయవంతంగా పరీక్షించిన హైడ్రోజన్ బాంబుతో పొరుగుదేశమైన దక్షిణ కొరియా ఉన్నతాధికారులతో అత్యవసర భేటీని నిర్వహించింది. హైడ్రోజన్ బాంబు పరీక్షను చైనా, జపాన్‌లు సైతం ఖండిస్తున్నాయి. కాగా, జనవరి 8వ తేదీన కిమ్ జోంగ్ ఉన్ పుట్టినరోజు కావడంతో తమ సత్తాను ప్రపంచ దేశాలకు తెలియజేయడం, తమవద్ద అణ్వస్త్రాలే కాకుండా ఇంకా చాలా ఉన్నాయని చెప్పడానికే ఉత్తరకొరియా ఈ ప్రయోగం చేసిందని భావిస్తున్నారు. ఉత్తర కొరియా చేపట్టిన హైడ్రోజన్ బాంబు పరీక్షపై అమెరికా స్పందించింది. ఐక్యరాజ్యసమితి తీర్మానాలను ఉత్తర కొరియా ఉల్లంఘించిందని వైట్ హౌజ్ ఓ ప్రకటనలో పేర్కొంది.