Begin typing your search above and press return to search.
ట్రంప్ పైకి క్షిపణి విసిరిన ఉ.కొరియా అధ్యక్షుడు
By: Tupaki Desk | 12 Feb 2017 5:36 AM GMT ‘‘సిటీకి పోలీస్ కమిషనర్లు వస్తుంటారు పోతుంటారు, చంటిగాడు లోకల్’’.. ఆంధ్రప్రదేశ్ కుర్రకారుకు ఒకప్పుడు తెగ నచ్చేసిన ఈ డైలాగు ఉత్తర కొరియా అధ్యక్షుడికి అతికినట్లు సరిపోతుంది. అమెరికా ఎన్ని ఆంక్షలు విధించినా.. అక్కడ ఎలాంటి ముదురు కేసులు అధ్యక్షులైనా కూడా ఉత్తర కొరియా మాత్రం నా దారి నాదే అంటోంది. ఒబామా తరువాత ట్రంప్ అధికారంలోకి వచ్చాక ప్రపంచ దేశాలతో అమెరికా ఎలాంటి సంబంధాలు నెరపనుందన్న ఆసక్తి సర్వత్రా వ్యక్తమవుతున్న సమయంలో ఉత్తర కొరియా మాత్రం ట్రంప్ ను కవ్వస్తూ భారీ రేంజి ఉన్న బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించింది.
ఉత్తర కొరియాలోని నార్త్ ప్యోంగ్యాంగ్ ప్రావిన్స్‌లోని బాంగ్యోన్ ఎయిర్ బేస్ నుంచి శనివారం ఈ పరీక్ష నిర్వహించినట్టు దక్షిణ కొరియా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. క్షిపణి పరీక్ష విజయవంతమైందని, 500 కిలోమీటర్ల దూరంలో జపాన్ సముద్రంలో పడిందని ఉత్తర కొరియా రక్షణ శాఖ తెలిపింది. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించాక ఉత్తర కొరియా నిర్వహించిన తొలి క్షిపణి పరీక్ష ఇదే. దీంతో ట్రంప్ తమ క్షిపణి పరీక్షపై ఎలా స్పందిస్తారోనని ఉత్తర కొరియా ఎదురుచూస్తోంది. అంతేకాదు... అసలు ట్రంప్ స్పందన ఎలా ఉందో తెలుసుకునేందుకే ఇప్పుడీ పరీక్ష చేసినట్లు కూడా అంటున్నారు. దీనిపై ట్రంప్ స్పందన ఎలా ఉంటుందో చూసుకుని దాన్ని బట్టి స్టెప్స్ వేయాలన్నది ఉత్తర కొరియా వ్యూహమట. మరి చిరకాల శత్రువు రష్యా ఇప్పుడు ట్రంప్ కు బాగా నచ్చతున్నట్లుగానే కొరకరాని కొయ్య ఉత్తర కొరియా కూడా నచ్చుతుందో లేదంటే.. ఎప్పటిలా వైరం కొనసాగిస్తారో చూడాలి.
కాగా ఇండియాలో దాదాపుగా ఇదే సమయంలో కీలక క్షిపణ పరీక్ష జరిగింది. అయితే.. ఇది అమెరికానో, చైనానో కవ్వించేందుకు కాదు. మన రక్షణ పాటవాన్ని పెంచుకునేందకు మాత్రమే. శత్రు క్షిపణులను తుత్తినియలు చేసే ఇంటర్ సెప్టర్ మిసైల్‌ను శనివారం భారత్ విజయవంతంగా పరీక్షించింది. భూ వాతావరణం నుంచి 50 కిలోమీటర్ల కన్నా ఎక్కువ దూరంలో ఉన్న లక్ష్యాలను ఈ క్షిపణి ఛేదించగలదు. బాలాసోర్‌లోని ఇంటిగ్రేటెడ్ టెస్ట్ రేంజ్(ఐటీఆర్) నుంచి శనివారం ఉదయం 7:45 గంటలకు పరీక్షించారు. ఈ క్షిపణి పరీక్ష విజయవంతం కావడంతో ఇటువంటి క్షిపణి కలిగిన ఐదో దేశంగా భారత్ అవతరించింది.