Begin typing your search above and press return to search.

వీడియో: అమెరికాపై కొరియా అణు బాంబు

By:  Tupaki Desk   |   20 April 2017 6:39 AM GMT
వీడియో: అమెరికాపై కొరియా అణు బాంబు
X
ఒక్కొక్క‌రికి ఒక్కో ఆనందం ఉంటుంది. అమెరికా అంటే చాలు అంతెత్తు ఎగిరిప‌డే ఉత్త‌ర‌కొరియాకు.. పెద్ద‌న్న అంటే ఎంత ఒళ్లు మంటో తెలిసిందే. త‌మ అధ్య‌క్షుడి మ‌న‌సును ఉల్లాస‌ప‌ర్చ‌టానికి.. ఉత్త‌ర‌కొరియా వ్య‌వ‌స్థాప‌కుడు కిమ్ 2 సంగ్ గౌర‌వార్థం ఓ మ్యూజిక‌ల్ ఈవెంట్ ను నిర్వ‌హించారు. ఇందులో ప్ర‌ద‌ర్శించిన వీడియో ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. ఉత్త‌ర కొరియా.. అమెరికా మ‌ధ్య‌నున్న ఉద్రిక్త ప‌రిస్థితుల నేప‌థ్యంలో.. పెద్ద‌న్నపై త‌మ‌కున్న అక్క‌సును వెళ్ల‌గ‌క్కే ఈ వీడియోలో.. అమెరికాపై అణుబాంబు వేస్తే ఎలా ఉంటుందో.. ఎంత వినాశ‌నం జ‌రుగుతుందో క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లుగా ఓ వీడియోను రూపొందించి దాన్ని ప్ర‌ద‌ర్శించారు.

ఫ‌సిపిక్ తీరం మీదుగా వ‌రుస పెట్టి అమెరికాపై అణు మిస్సైల్స్‌ ను సంధించిన‌ట్లుగా చూపించే ఈ వీడియోలో.. ఆ దాడి అనంత‌రం.. అమెరికాలో చోటు చేసుకునే విధ్వంసం ఎంత దారుణంగా ఉంటుందో చెప్పే ప్ర‌య‌త్నం చేశారు. మిస్సైల్ దాడితో అమెరికాలోని ప‌లు న‌గ‌రాలు మంట‌ల్లో కాలిపోయిన‌ట్లు ఉండ‌ట‌మే కాదు.. చివ‌ర‌కు అమెరికా జెండా కాలిపోవ‌టంతో వీడియో ముగిసేలా త‌యారు చేశారు.

ఈ వీడియోను వీక్షించిన‌ప్పుడు ఆ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న వారంతా ఆనందోత్సాహాల‌తో సంబ‌రాలు జ‌రుపుకున్నార‌ని.. సైనికుల ఆనంద‌హేల‌ను చూసి అధ్య‌క్షుడు కిమ్ జోంగ్ ఉన్ కూడా సంతోషాన్ని వ్య‌క్తం చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో మిస్సైల్ దాడికి సంబంధించిన ఒక పాట‌ను ప్ర‌త్యేకంగా ప్లే చేసిన‌ట్లుగా అక్క‌డి మీడియా సంస్థ ఒక‌టి వెల్ల‌డించింది. అయితే.. ఈ త‌ర‌హా వీడియోలు త‌యారు చేయ‌టం ఉత్త‌ర‌కొరియాకు కొత్తేం కాదు. గ‌తంలోనూ కొలంబియా.. అమెరికా రాజ‌ధాని వాషింగ్ట‌న్ ల‌పై అణుదాడి చేస్తే ఎలా ఉంటుంద‌న్న వీడియోను కూడా రూపొందించారు. అయితే.. ఈ వీడియో బ‌య‌ట‌కు రాలేదు. ఆ దేశంలో నెల‌కొన్న నిబంధ‌న‌లు.. ప‌రిమితులు.. ఇంట‌ర్నెట్ వినియోగం ప‌రిమితంగా ఉండ‌టంతో ఈ వీడియో బ‌య‌ట‌కు రాలేదు. తాజా వీడియోతో అమెరికా.. ఉత్త‌ర‌కొరియాల మ‌ధ్య ఉద్రిక్త ప‌రిస్థితులు తారా స్థాయికి చేరుకున్న‌ట్లుగా చెబుతున్నారు. ట్రంప్ లాంటి అధ్య‌క్షుడు ఉన్న వేళ‌.. మూర్ఖుడైన కిమ్ అండ్ కో త‌యారు చేసిన వీడియోకి త‌గిన మూల్యం చెల్లించాల్సి ఉంటుంద‌న్న అభిప్రాయాన్ని ప‌లువురు వ్య‌క్తం చేస్తున్నారు.




Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/