Begin typing your search above and press return to search.
జపాన్ బంగారు పుట్టలో వేలెట్టి కెలికాడు
By: Tupaki Desk | 5 April 2017 9:01 AM GMTమొండోడు రాజు కంటే బలవంతుడంటారు. అలాంటిది రాజే మొండోడు.. మూర్ఖుడు అయితే? ఉత్తరకొరియా అధ్యక్షుడి తీరు ఇలానే ఉంటుంది. పరమ రాక్షసంగా పాలిస్తూ.. తనకు నచ్చని వారిని నిర్దాక్షిణ్యంగా హతమార్చే అతగాడిని అగ్రరాజ్యాలు సైతం ఏమీ చేయలేని పరిస్థితి. పిచ్చోడి చేతిలో రాయి మాదిరి.. తరచూ తన దగ్గరున్న అయుద సంపత్తితో ఇష్టారాజ్యంగా చెలరేగిపోయే అతగాడి పుణ్యమా అని కొరియా సరిహద్దు దేశాల మధ్య తరచూ ఉద్రిక్తతలు చోటు చేసుకోవటం ఈ మధ్యన ఎక్కువైంది.
తన మానాన తాను ఉండకుండా.. నిత్యం ఎవరినో ఒకరిని కెలికేలా చేసే ఉత్తర కొరియా.. తాజాగా మరోసారి రెచ్చిపోయింది. జపాన్ దేశ సరిహద్దుల్లోని సముద్రంలోకి ఓ బాలిస్టిక్ క్షిపణిని ప్రయోగించి ఆ దేశానికి ఎక్కడో మండిపోయేలా చేసింది. కేఎస్ 15 మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఉత్తరకొరియా ప్రయోగించిందని.. ఈ ప్రయోగం మొదలైన తొమ్మిది నిమిషాలకు ఆ క్షిపణి జపాన్ సముద్ర జలాల్లో కూలిన వైనం బయటకు వచ్చింది. గతంలో జపాన్.. దక్షిణ కొరియా జలాల్లోకి క్షిపణుల్ని ప్రయోగించిన ఉత్తరకొరియా తీరుపై జపాన్ ఆగ్రహాం వ్యక్తం చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఉత్తరకొరియాను ఎదుర్కొనేందుకు అమెరికా.. చైనాలు కలిసి పని చేయాలన్న ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ అంశంపై ఇరు దేశాల దేశాధినేతలు సమావేశం కానున్నారు. ఇలాంటి వేళలోనే.. ఉత్తరకొరియా క్షిపణిని ప్రయోగించటం చర్చగా మారింది. మరోవైపు.. ఉత్తర కొరియా విషయంలో చైనా తమకు మద్దతు ఇవ్వకున్నా.. ఒంటరిగా అయినా ఆ దేశాన్ని ఎదుర్కొంటామని అమెరికా చెబుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా జరిపిన క్షిపణి ప్రయోగంపై జపాన్ సీరియస్ గా ఉంది. ఈ ఉద్రిక్తతలు ఎక్కడి వరకూ వెళతాయన్నది ఇప్పుడు ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/