Begin typing your search above and press return to search.

కిమ్ పోయినా పీడ విర‌గ‌డ కాన‌ట్లేన‌ట‌

By:  Tupaki Desk   |   4 Sep 2017 8:16 AM GMT
కిమ్ పోయినా పీడ విర‌గ‌డ కాన‌ట్లేన‌ట‌
X
ఇప్పుడు ప్ర‌పంచాన్ని క‌ల‌వ‌ర‌పాటుకు గురి చేస్తున్న వారిలో ఉత్త‌ర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ ముఖ్యుడు. పిచ్చోడి చేతిలో రాయిలా మారిన అణ్వాస్త్రాలతో వ‌రుస పెట్టి ప్ర‌యోగాలు చేస్తున్న అత‌గాడి తీరుతో ఈ ప్ర‌పంచానికి ఎప్పుడేం ముంచుకొస్తుందో అర్థం కాని రీతిలో ప‌రిస్థితులు మారిపోయాయి.

కిమ్ ప్ర‌యోగాలపై ప్ర‌పంచ దేశాలు ఖండ‌న‌లు మీద ఖండ‌న‌లు చేస్తున్నాయి. అయి నాలెక్క చేయ‌ని కిమ్‌ తీరుపై అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అయినా ప‌ట్టించుకోని కిమ్ త‌న దారిన తాను అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వైఖ‌రితో ఎప్పుడేం జ‌రుగుతుందోన‌న్న భ‌యాందోళ‌న‌లు వ్య‌క్త‌మ‌వుతున్నాయి.

ఇలాంటి ప‌రిస్థితుల్లో ఏదైనా జ‌రిగి కిమ్ జాంగ్ ఉన్ అంతం కాని జ‌రిగితే త‌ర్వాతి ప‌రిణామాలు ఏమిట‌న్న‌ది ఇప్పుడు ప్ర‌శ్న‌గా మారాయి. తాజాగా ఈ అంశంపై ఒక నివేదిక బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీని ప్ర‌కారం కిమ్ జాంగ్ ఉన్ అంత‌మైనా అత‌నితో పాటు అత‌గాడి క్రూర‌త్వం పోద‌న్న విష‌యాన్ని చెబుతున్నారు. ఎందుకంటే.. కిమ్ జూనియ‌ర్ ను సిద్ధం చేయ‌ట‌మే కార‌ణం.

కిమ్‌.. రీసోల్ జూ దంప‌తుల తొలి సంతాన‌మైన కిమ్ జూనియ‌ర్ (ఇత‌గాడి అస‌లు పేరు ప్ర‌పంచానికి ఇప్ప‌టివ‌ర‌కూ తెలీదు) చేత పాల‌న సాగించేందుకు వీలుగా స‌క‌ల విద్య‌ల్లో ప్రావీణ్యం సాధిస్తున్న‌ట్లు ద‌క్షిణ కొరియా గూఢాచార సంస్థ చెబుతోంది. కిమ్ కు మొత్తం ముగ్గురు సంతానంగా చెబుతున్నారు. కిమ్‌ కు 2009లో పెళ్లి జ‌ర‌గ్గా.. 2010లో తొలి సంతానానికి జ‌న్మ‌నిచ్చారు. అనంత‌రం 2013లో రెండో కాన్పులో రీసోల్ అమ్మాయికి జ‌న్మ‌నిచ్చిన‌ట్లు చెబుతారు.

ఇది వాస్త‌వ‌మేన‌ని న‌మ్మ‌కానికి కార‌ణంగా.. ఉత్త‌ర కొరియాకు వెళ్లిన బాస్కెట్ బాల్ మాజీ క్రీడాకారుడు డెన్నిస్ రాడ్ మ‌న్ కిమ్ తాను కిమ్ జాంగ్ రెండో సంతానాన్ని ఎత్తుకున్న‌ట్లుగా పేర్కొన‌ట‌మే కార‌ణం. వీరి కుటుంబం చూడ చ‌క్క‌గా ఉంటుందని చెబుతారు. ఇదిలా ఉంటే.. ఈ ఫిబ్ర‌వ‌రిలో కిమ్ మూడో సంతానానికి జ‌న్మ‌నిచ్చారు. ఈ వార్త నిజ‌మ‌ని చెప్ప‌టానికి వీలుగా.. గ‌త ఏడాదిగా కిమ్ స‌తీమ‌ణి బ‌య‌ట‌ప్ర‌పంచానికి క‌నిపించ‌క‌పోవ‌టంగా చెప్పాలి. ఒక‌వేళ సీనియ‌ర్ కిమ్‌ కు ఏదైనా జ‌రిగితే.. జూనియ‌ర్ కిమ్‌ ను తెర మీద‌కు తెస్తార‌ని చెబుతున్నారు. అంటే.. కిమ్ తో అత‌గాడి ఆరాచ‌కం అంతం కాద‌న్న మాట‌.