Begin typing your search above and press return to search.
సైనికులారా పంట దోచుకుని తినండి
By: Tupaki Desk | 2 Sep 2017 5:15 AM GMTశేలు దప్పినోడు శేను పెడితే వడగండ్ల వానొచ్చి పోయిందని సామెత. ఉత్తర కొరియా పరిస్థితి - ఆ దేశ ప్రభుత్వ నిర్ణయాలు కొన్ని ఈ సామెతకు తగినట్లే ఉన్నాయి. గత కొన్నేండ్లుగా ప్రపంచ దేశాలు ముఖ్యంగా అమెరికా సూచనలు - బెదిరింపులు పట్టించుకోకుండా అణు - క్షిపణి ప్రయోగాలు చేసుకుంటూ ముందుకుపోతుంది. తమ జోలికి వస్తే ఒక్క బాంబుతో అమెరికాను నాశనం చేస్తాం అని హెచ్చిరిస్తుంది. ఇక అమెరికాలో ట్రంప్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగాయి.
ఈ నెల రోజులుగా ఏ క్షణమయినా అమెరికా ఉత్తర కొరియా మీద యుద్దానికి దిగొచ్చన్న వాతవరణం కనిపిస్తుంది. అమెరికా దాడిని తిప్పికొట్టేందుకు తాము సిద్దం అని ఉత్తర కొరియా అంటుంది. తాజాగా ఆ దేశం ప్రయోగించిన ఓ క్షిపణి జపాన్ సమీప సముద్ర జలాలలో పడింది. ఇక తమకు అమెరికా దాడి పెద్ద పని కాదని ఈ ప్రయోగం ద్వారా ఉత్తర కొరియా హెచ్చరించింది.
ఏ క్షణంలో అయినా యుద్దం రావచ్చన ఉద్దేశంతో ఇన్నేళ్ళు కేవలం అణుపాటవం - క్షిపణి పాటవం మాత్రమే పెంచుకునే ప్రయత్నాలలో ఉన్న ఉత్తర కొరియా తాజాగా సైనికుల మీద దృష్టి సారించింది. సరయిన ఆహారం లేక సైనికులు పోషకాహారలోపంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఆ దేశ అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ పోషకాహార లోపాన్ని అధిగమించేందుకు కనిపించే మొక్కజొన్న పొలాలపై పడి దొంగిలించి కావాల్సినన్ని తినొచ్చని, ఈ విషయంలో సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇస్తున్నామని ఆ దేశ సైనికాధికారుల నుండి ప్రకటన విడుదల చేయించారు. యుద్దానికి ఉత్తర కొరియా అన్ని విధాలుగా సన్నద్దం అవుతుందని అర్థం అవుతుంది.