Begin typing your search above and press return to search.

భారత టెక్కీలకి గుడ్ న్యూస్..హెచ్1బీ వీసాలపై నిషేధం ఎత్తివేయాలంటూ కోర్టు ఆదేశాలు

By:  Tupaki Desk   |   2 Oct 2020 11:30 PM GMT
భారత టెక్కీలకి గుడ్ న్యూస్..హెచ్1బీ వీసాలపై నిషేధం ఎత్తివేయాలంటూ కోర్టు ఆదేశాలు
X
అమెరికా అధినేత డొనాల్డ్ ట్రంప్ గతంలో హెచ్1బీ వీసాలపై నిషేధం విధిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఆ ఉత్తర్వులపై అమెరికాలోని నార్తర్న్ కాలిఫోర్నియా కోర్టు తీర్పు వెల్లడించింది. హెచ్1బీ వీసాలపై నిషేధాన్ని తొలగించాలంటూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ట్రంప్ చర్యలు రాజ్యాంగ అధికార పరిధిని మించిపోయాయని న్యాయస్థానం ఈ సందర్భంగా చెప్పుకొచ్చింది. ఇమ్మిగ్రేషన్ పరిధిని నిర్ణయించే అధికారం అధ్యక్షుడికి లేదని కోర్టు స్పష్టం చేసింది.

ఈ క్రమంలో ట్రంప్ జారీ చేసిన ఉత్తర్వులను కోర్టు కొట్టివేసింది. ఈ ఏడాది జూన్ లో హెచ్1బీ వీసాలపై డిసెంబరు వరకు నిషేధం విధిస్తూ ట్రంప్ తీసుకున్న నిర్ణయం లక్షల సంఖ్యలో విదేశీ ఐటీ నిపుణులకు శరాఘాతంలా తాకింది. ముఖ్యంగా భారత ఐటీ నిపుణులకు ఈ నిర్ణయం తీవ్ర అసంతృప్తి కలిగించింది. అయితే వీసాలపై ట్రంప్ ఉత్తర్వులను సవాల్ చేస్తూ అమెరికా ఉత్పత్తిదారుల జాతీయ సమాఖ్య, యూఎస్ చాంబర్ ఆఫ్ కామర్స్, నేషనల్ రీటెయిల్ ఫెడరేషన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించాయి. తమ కంపెనీలకు ప్రతిభావంతులైన నిపుణులు రాకుండా ఈ నిబంధనలు అడ్డుకుంటున్నాయని ఆయా సంస్థలు తమ పిటిషన్లలో తెలిపాయి. ఈ పిటిషన్లపై విచారణ జరిపిన న్యాయస్థానం తాజా నిర్ణయం వెలువరించింది.