Begin typing your search above and press return to search.
ఆ దేశ ప్రధానికి ఫైన్ విధించిన పోలీసులు.. ఇదిరా ప్రజాస్వామ్యం అంటే?
By: Tupaki Desk | 10 April 2021 4:30 AM GMTఅవును.. రూల్ అంటే రూలే. దేశ ప్రధాని అయినా.. పక్కింటి సుబ్బమ్మ అయినా ఒక్కటే అన్నట్లుగా ఉండాలి. అదే అసలుసిసలు ప్రజాస్వామ్యం. పుస్తకాల్లో వినిపించే ప్రజాస్వామ్యం.. చేతల్లో చాలావరకు కనిపించదు. అన్ని దేశాల్లోనూ అలాంటి పరిస్థితి ఉండదు. తాజాగా కోవిడ్ నిబంధనలకు విరుద్ధంగా ఒక దేశ ప్రధానికి భారీగా ఫైన్ విధించిన వైనం ఇప్పుడు సంచలనంగా మారింది. ఈ విషయంలో ప్రధానితో పాటు.. ఆ దేశ పోలీసుల కమిట్ మెంట్ ను అభినందించాల్సిందే. ఇంతకీ దేశ ప్రధానికి పోలీసులు జరిమానా విధించిన ఆ అద్భుత దేశం మరేదో కాదు.. యూరోపియన్ యూనియన్ లో ఉండే బుల్లి దేశమైన నార్వేలో.
ఇంతకీ జరిగిందేమంటే.. కోవిడ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో ఏం చేయాలి? ఏం చేయకూడదన్న రూల్స్ ను తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించిన వారు ఎవరైనా సరే.. జరిమానా విధించేలా చర్యల్ని స్పష్టం చేశారు. ఇదిలా ఉండే నార్వే ప్రధాని ఎర్నా సోల్ బెర్గ్ తన 60వ పుట్టినరోజును ఒక రిసార్టులో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె తన పదమూడు మంది కుటుంబ సభ్యుల్ని పార్టీకి ఆహ్వానించారు.
ఆ దేశ నిబంధనల ప్రకారం ఈ తరహా వేడుకులకు కేవలం పది మందిని మాత్రమే పిలవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా పరిమితికి మించి పిలిచిన ఆమెకు 20వేల నార్వేజియన్ క్రోన్ ల ఫైన్ ను అక్కడి పోలీసులు విధించారు. మన రూపాయిల్లో చూస్తే.. రూ.1.75లక్షలుగా చెప్పాలి. కోవిడ్ నిబంధనల అమలుపై ప్రజల్లో నమ్మకం పెంచటానికే దేశ ప్రధానికి జరిమానా విదించటం జరిగిందన్నారు. కాగా.. జరిగిన ఉదంతంపై ప్రధాని.. దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు.
పది మంది మాత్రమే హాజరు కావాలన్న నిబంధనకు కేవలం ముగ్గురు అదనంగా వస్తేనే ఇంత రచ్చ జరిగితే.. మన లాంటి దేశంలో ఇలాంటివి కలలో కూడా ఊహించగలమా? దేశ ప్రధానికి ఫైన్ వేయటం తర్వాత.. ఆ ఆలోచన రావటానికి సైతం మనోళ్లు ఇష్టపడరేమో? ఏమైనా.. తప్పు చేసిన వారు ప్రధాని అయినా సరే వదిలిపెట్టేది లేదన్న విషయాన్ని నార్వే పోలీసులు స్పష్టం చేస్తే.. చట్టానికి దేశ ప్రధాని సైతం అతీతం కాదన్న విషయాన్ని ప్రధాని హోదాలో ఉన్న ఎర్నాసోల్ బెర్గ్ స్పష్టం చేశారు. ఈ ఎపిసోడ్ లో ఇద్దరూ ఇద్దరే. ఇది కదా అసలుసిసలు ప్రజాస్వామ్యం అంటే.