Begin typing your search above and press return to search.
రాజకీయాలపై గోవా సీఎం అంతమాటన్నారా?
By: Tupaki Desk | 8 Sep 2017 9:16 AM GMTఅవునట! తనకు రాజకీయాలంటే ఇష్టమే లేదట. ఈ విషయం ప్రస్తుతం గోవా సీఎం గా ఉన్న మనోహర్ పర్రీకర్ బల్లగుద్ది మరీ చెప్పుకొచ్చారు. గతంలోనూ గోవాకి సీఎంగా వ్యవహరించిన ఆయన సింప్లిసిటీకి అర్ధం చెప్పారు! ఓ రాష్ట్రానికి ఈయన సీఎం అంటే నమ్మలేం అనే స్థాయిలో ఆయన సాధారణ వ్యక్తిగానే జీవించారు. ఓ మూడు వందలు ఖరీదు చేసే చెప్పులు అవి కూడా రెండు జతలే. ఒక జత బూట్లు - సాధారణ వస్త్ర ధారణ తప్ప ఆయనేమీ హంగామా ప్రదర్శించరు. అసలు ఆయనకు ఇలాంటివి ఇష్టం కూడా ఉండవు. ఇవే ఆయనను దేశంలో ప్రముఖ వ్యక్తిగా నిలబెట్టాయి.
విద్యాధికుడు కూడా అయిన పర్రీకర్.. ఐఐటీ చేశారు. కేంద్రంలో రక్షణ మంత్రిగా పాక్ పై దాడులు చేయడంలో తన వ్యూహాన్ని అమలు చేసి భేష్ అనిపించుకున్నారు. సర్జికల్ స్ట్రైక్స్ తో విరుచుకుపడ్డారు. అయితే, గోవాలో జరగిన ఎన్నికల నేపథ్యంలో ఆయనను తిరిగి సీఎం పీఠంపై కూర్చోబెట్టింది బీజేపీ అధిష్టానం. ఇటీవల ఆయన తన ఎంపీ పదవికి రాజీనామా చేసి.. ఉప ఎన్నికలో గోవా నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తనకు రాజకీయాలంటే ఇష్టం లేదని కుండబద్దలు కొట్టారు.
‘నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఇంకా చెప్పాలంటే రాజకీయాల్లోకి వస్తానని కలలో కూడా అనుకోలేదు. కానీ రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కేవలం 10 ఏళ్ల కాలానికే రాజకీయాలకు గుడ్ బై చెబుతానని భావించాను. ఒకవేళ నేను రాజకీయాలకు తగిన వాడిని కాదని ఆలోచన వస్తే మాత్రం క్షణం కూడా ఆలోచించకుండా నా పదవికి రాజీనామా చేసి ఇంట్లో కూర్చునేవాడినని’ కేంద్ర మాజీ మంత్రి - గోవా సీఎం మనోహర్ చెప్పడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అంతేకాదు, తనకు ఇష్టం లేకున్నా రాజకీయ జీవితం ప్రారంభించాల్సి వచ్చిందని ఆయన చెప్పడం మరింత ఆశ్చర్యకర విషయం.
’గతంలో కేంద్రం సూచన మేరకు సీఎం పదవికి రాజీనామా చేసి అక్కడ మంత్రి పదవి చేపట్టాను. అయితే గోవా ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని మళ్లీ మీ కోసం తిరిగొచ్చేశాను. ఈసారి ఏం జరిగినా సరే.. ఎలాంటి ఆపద వచ్చినా తట్టుకుని నిలబడతాను. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ మధ్యలో విడిచి వెళ్లిపోను. సీఎంగా పూర్తికాలం పదవిలో కొనసాగుతాను. మా ప్రభుత్వానికి ఎలాంటి ఢోకాలేదు. నాది రాజకీయ నేపథ్య కుటుంబం కాదు. ఒకవేళ పొలిటికల్ ఫ్యామిలీలో పుట్టినవాడినైతే ఢిల్లీ రాజకీయాలకు అనుగుణంగా మారేవాడినని’ ఆయన అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం పర్రీకర్ వ్యాఖ్యలు అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తుతుండడం గమనార్హం.