Begin typing your search above and press return to search.

క‌మ‌ల్ మాట‌ను ర‌జ‌నీ ఒప్పుకుంటారా?

By:  Tupaki Desk   |   26 Jan 2018 8:22 AM GMT
క‌మ‌ల్ మాట‌ను ర‌జ‌నీ ఒప్పుకుంటారా?
X
త‌మిళ రాజ‌కీయాల్లో రోజుకో కొత్త మాట వినిపిస్తోంది. అన్నాడీఎంకే అధినేత్రి - దివంగ‌త సీఎం జ‌య‌ల‌లిత మ‌ర‌ణానంత‌రం ఆ రాష్ట్రంలో ఏర్ప‌డ్డ రాజ‌కీయ శూన్య‌త నేప‌థ్యంలో.. త‌మ పొలిటిక‌ల్ ఎంట్రీకి ఇదే స‌రైన త‌రుణ‌మ‌ని భావించిన కోలీవుడ్ ప్ర‌ముఖులు ర‌జ‌నీకాంత్ - క‌మ‌ల్ హాస‌న్ రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశారు. విడ‌త‌ల‌వారీగా జ‌రిగిన చ‌ర్చ‌ల తర్వాత వీరిద్ద‌రూ రాజకీయాల్లోకి వ‌చ్చేసిన‌ట్లుగా ప్ర‌క‌టించేశారు. అయితే ఇద్ద‌రు చెరో పార్టీ పెట్టుకుని బ‌రిలోకి దిగుతున్న నేప‌థ్యంలో అస‌లు వీరి బాట ఎలా ఉంటుంద‌న్న విష‌యంపై స‌ర్వ‌త్ర చ‌ర్చ జ‌రుగుతోంది. ఇద్ద‌రూ క‌లిసి వ‌స్తే... మెరుగైన ఫ‌లితాలు వ‌స్తాయ‌ని చాలా మంది భావిస్తున్నా... వీరిద్ద‌రూ క‌లిసి ప్ర‌యాణం సాగించే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. ఎందుకంటే రాజ‌కీయంగా వారు సిద్ధం చేసుకుంటున్న మార్గాలే వేరు వేరుగానే ఉంటున్నాయ‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.

త‌న‌కున్న అశేష అభిమానుల‌తో ఫొటో సెష‌న్ల పేర‌ట సుదీర్ఘ చ‌ర్చ‌లు నిర్వ‌హించిన ర‌జ‌నీ... మొన్న తాను రాజ‌కీయాల్లోకి వ‌చ్చేశానంటూ సంచ‌ల‌న ప్ర‌క‌టన చేశారు. అదే స‌మ‌యంలో త‌న పార్టీ పేరును త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తానని, ఇక‌పై వ‌చ్చే అన్ని ఎన్నిక‌ల్లో - అన్ని స్థానాల్లోనూ త‌న పార్టీ బ‌రిలోకి దిగుతుంద‌ని కూడా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇక ర‌జ‌నీ ఎంట్రీకి కాస్తంత ముందుగానే రాజ‌కీయాల్లోకి వ‌చ్చేసిన‌ట్లు ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌... తాను ర‌జ‌నీ పార్టీతో కాకుండా కొత్త పార్టీతో బ‌రిలోకి దిగుతున్న‌ట్లు ప్ర‌కటించారు. దీంతో ఈ ఇద్ద‌రు న‌టులు కూడా వేర్వేరు పార్టీల‌తోనే రాజ‌కీయ తెరంగేట్రం చేస్తున్న‌ట్లుగా తేలిపోయింది. ఈ త‌రుణంలో నిన్న మీడియా ముందుకు వ‌చ్చిన క‌మ‌ల్ హాస‌న్ మ‌రోమారు సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. రాజ‌కీయాల్లో త‌న‌దీ - ర‌జ‌నీది ఒకే బాట అంటూ కొత్త ప‌ల్ల‌వి అందుకున్నారు. అయితే తామిద్ద‌రివీ వేర్వేరు పార్టీలేన‌ని - అయిన‌ప్ప‌టికీ తామిద్ద‌రి ప్ర‌యాణం ఒకే బాట‌లోనే సాగుతుంద‌ని చెప్పుకొచ్చారు.

అవినీతి నిర్మూల‌నే ధ్వేయంగా తాను రాజ‌కీయాల్లోకి వ‌స్తున్నాన‌ని ప్ర‌క‌టించిన క‌మ‌ల్‌... దాదాపు ర‌జ‌నీ కూడా ఇదే ల‌క్ష్యంతో బ‌రిలోకి దిగుతున్నాడ‌ని పేర్కొన్నారు. వెర‌సి త‌మ ఇద్ద‌రికీ రాజ‌కీయాల్లో ఒకే ల‌క్ష్య‌మ‌ని కూడా క‌మ‌ల్ ప్ర‌క‌టించేశారు. ఆధ్యాత్మికతో కూడిన రాజకీయపార్టీతో రజనీకాంత్‌ ప్రజల్లోకి వస్తున్నారని కమల్ హాసన్ వివరించారు. తనకు రజనీకాంత్ పోటీ కాదని, రజనీకాంత్ కు తాను పోటీ కాదని, ఇద్దరూ అవనినీతిని నిర్మూలించడానికే రాజకీయాల్లోకి వస్తున్నామని కమల్ హాసన్ వివరించారు. తాను భిన్నమైన ధోరణితో రాజకీయాల్లోకి వస్తున్నానని, అవినీతి నిర్మూలన అనే లక్ష్యంలో రజనీకాంత్, తనకు ఏమాత్రం తేడా లేదని కమల్ అన్నారు.

ఫిబ్రవరి 21వ తేదీ నుంచి చేపట్టబోతున్న రాష్ట్రవ్యాప్త పర్యటనకు నాళై నమదే (రేపు మనదే) అని నామకరణం చేశామని కమల్‌ హాసన్ చెప్పారు. గతంలో ఎంజీ రామచంద్రన్‌ (ఎంజీఆర్) నటించిన చిత్రం నాళై నమదు (రేపు మనదే) పేరును తన పర్యటనకు పెట్టుకోవడంలో ఎలాం టి తప్పులేదని తాను భావిస్తున్నానని కమల్ అన్నారు. నాళై నమదు (రేపు మనదే) సినిమా విడుదల తరువాతే ఎంజీఆర్ రాజకీయాల్లోకి ప్రవేశించారు. తన పార్టీపేరు - చిహ్నాన్ని ఫిబ్రవరి నెలలో ప్రకటిస్తానని కమల్ హాసన్ అన్నారు. లక్ష్యసాధనలో ఎన్ని అడ్డంకులు ఎదురైనా రాజకీయాల్లో వెనకడుగువేసే ప్రసక్తేలేదని కమల్ హాసన్ చెప్పారు. తన అభిమానులు - ప్రజలు తప్పకుండా త‌న‌ను ఆశీర్వదిస్తారనే నమ్మకం ఉందని కమల్ హాసన్ ధీమా వ్యక్తం చేశారు.