Begin typing your search above and press return to search.

మర్డర్ అటెంప్టు కాదు.. రోడ్ యాక్సిడెంట్ మాత్రమేనట

By:  Tupaki Desk   |   25 March 2021 7:48 AM GMT
మర్డర్ అటెంప్టు కాదు.. రోడ్ యాక్సిడెంట్ మాత్రమేనట
X
ఇవాల్టి ఉదయం కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో ఒక సమాచారం ప్రముఖంగా వచ్చింది. కాసేపటికే అది పలు గ్రూపుల్లో దర్శనం ఇవ్వటమే కాదు..ఆందోళన వ్యక్తమైంది. ఆ మెసేజ్ సారాంశం.. తెలంగాణ భీమ్ అధ్యక్షుడు రావణపై బుధవారం అర్థరాత్రి హత్యాయత్నం జరిగిందని. దీంతో.. టెన్షన్ నెలకొంది. అప్పటికే ఫోన్లలో ఫాలో అప్ లు మొదలు కావటంతో పోలీసులు ఒక్కసారిగా అలెర్టు అయ్యారు.

ఇంతకీ హత్యాయత్నం జరిగినట్లుగా సాగిన ప్రచారంలో నిజమెంత? నిజంగానే ఆయనపై హత్యాయత్నం జరిగిందా? అన్న ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నంలో పోలీసులకు కొత్త సందేహాలు వ్యక్తమయ్యాయి. వాటికి సమాధానాలు వెతికే వేళ.. అసలు విషయం బయటకు వచ్చిన పోలీసులు షాక్ తినే పరిస్థితి. పోలీసులు సేకరించిన సమాచారానికి సీసీ కెమేరాల ఫుటేజ్ బయటకు రావటంతోఈ ఇష్యూ ఒక కొలిక్కి వచ్చింది. ఇంతకూ అసలేం జరిగింది? నిజంగానే సుజిత్ రావణపై హత్యాయత్నం జరిగిందా? అన్న విషయంపై పంజాగుట్ట సీఐ ఏం చెప్పారంటే..

బుధవారం అర్థరాత్రి ఒంటి గంట వేళలో సుజిత్ టూవీలర్ మీద బంజారాహిల్స్ లోని తన ఇంటికి వెళుతున్న వేళ ఖైరతాబాద్ జంక్షన్ వద్దకు రాగానే బైక్ అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. ఈ ఘటనలో డివైడర్ పైన ఉన్న ఇనుపచువ్వ ఆయన ఛాతీ కింది భాగంగా గుచ్చుకోవటంలో తీవ్రంగా గాయపడ్డారు.

దీంతో.. సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించారు. ఆయన ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగానే ఉందని పేర్కొన్నారు. ప్రమాదంలో గాయపడిన సుజిత్ వెర్షన్ వేరేలా ఉంది. ఖైరతాబాద్ జంక్షన్ లో గుర్తు తెలియని దుండగులు తనపై కత్తులతో దాడి చేసి స్కార్పియో వాహనంలో పరారయ్యారని పోలీసులకు కంప్లైంట్ చేశారు. దీనికి తగ్గట్లే.. వాట్సాప్ గ్రూపుల్లో మెసేజ్ లు వైరల్ అయ్యాయి. అయితే.. సీసీ టీవీ ఫుటేజీ పరిశీలించినప్పుడు ఈ విషయం గుర్తించిన పోలీసులు అవాక్కు అయ్యారు. దీంతో.. తప్పుడు సమాచారం ఎందుకు ఇచ్చారన్న అంశంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.