Begin typing your search above and press return to search.

ఆంటీలను సం'తృప్తి' పరిస్తే డబ్బులే డబ్బులు.!

By:  Tupaki Desk   |   24 Feb 2020 12:30 AM GMT
ఆంటీలను సంతృప్తి పరిస్తే డబ్బులే డబ్బులు.!
X
శృంగారమంటే మక్కువ ఉన్నవారే వాళ్లే టార్గెట్. కుర్రాకారుకు ఆంటీలను.. ఆంటీలకు కుర్రకారును ఎరవేస్తూ రెండుచేతుల సంపాదిస్తున్నారు. హైటెక్ పద్ధతులతో గుట్టుగా సాగుతున్న ఈ దందా హైదరాబాద్ లో వెలుగుచూసింది. వీరి ఆట కట్టించేందుకు ఇప్పటికే సైబర్ క్రైమ్ - తెలంగాణ పోలీసులు రంగంలోకి దిగారు.

శృంగారంలో తన పార్టనర్ తో సంతృప్తి చెందిన ఆడవాళ్లు.. ఈజీగా మనీ సంపాదించాలనే కుర్రకారే ఈ దందాకు పెట్టుబడి. వాళ్ల వీక్ పాయింట్ ను అడ్డంపెట్టుకొని కొందరు ముఠాగా ఏర్పడి వ్యాపారం కొనసాగిస్తున్నారు. నిత్యం వెబ్ సెట్లు - వాట్సాప్ - సోషల్ మీడియాల్లో ప్రకటనలిస్తూ శృంగారంలో అసంతృప్తిగా ఉన్నవారిని కస్టమర్లుగా మలుచుకుంటున్నారు. వీరి మాయలో డబ్బులున్న ఆంటీలు - అమ్మాయిలు - ఉద్యోగం లేని యువత - జల్సా చేసే కుర్రాళ్లు అనేకమంది ఉన్నట్లు సమాచారం.

కుర్రకారుకు అమ్మాయిలకంటే ఆంటీ లంటేనే ఎక్కువ ఇష్టం. అనుభవం గల వారు అర్థం చేసుకుంటారని.. శృంగారాన్ని బాగా అస్వాదించవచ్చన్న ఫీలింగ్ కుర్రాళ్లలో ఉంటుంది. దీంతో వారి వీక్ నెస్ ను క్యాష్ చేసుకుంటూ కుర్రాళ్లకు ఆంటీలను ఏరవేస్తూ డబ్బులు దండుకుంటున్నారు.

అదేవిధంగా వివాహిత జీవితంలో భర్తతో సంతృప్తి చెందని ఆంటీలకు కుర్రాళ్లంటే ఇష్టం. ఇలాంటి ఆంటీలకు కుర్రకారును ఏరవేస్తూ రెండు చేతుల డబ్బులు దండుకుంటున్నారు. ఒకే దెబ్బకు రెండు పిట్టలు అన్న చందంగా ఇటూ కుర్రాళ్ల దగ్గర నుంచి, అటూ ఆంటీల దగ్గర నుంచి లక్షల్లో సంపాదిస్తున్నారు.

ఈ వ్యాపారం మూడు పువ్వులు ఆరుకాయలుగా ఉండటంతో ఈ గ్యాంగ్ కొత్తగా హైదరాబాద్ లో కాల్ బాయ్ సెంటర్ ప్రారంభించినట్లు సమాచారం. ఆంటీలను తృప్తిపరిస్తే అడిగినంత డబ్బులిస్తామంటూ ఉద్యోగాలు లేని కుర్రవాళ్లను తమవైపు తిప్పుకుంటుందట.. ఇంకేముందే ఈజీ మనీతోపాటు ఆంటీల సుఖం దొరకుతుండటంతో ఈ గ్యాంగ్ వ్యాపారం గుట్టుచప్పుడుగా కాకుండా నడుస్తోంది.

అయితే ఇటీవల ఓ యువకుడు ఈ గ్యాంగ్ చేసే దందాపై పోలీసులను ఆశ్రయించాడు. సదరు యువకుడితో ఈ గ్యాంగ్ ముందుగా కొంత డబ్బు కట్టించుకుంది. కత్తిలాంటి అమ్మాయిలు - ఆంటీలను ఏరగా చూపి డబ్బులు దండుకొని మొఖం చాటడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై సైబర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. తీగ లాగితే డొంక కదిలింది. ఈ యువకుడిగా మాదిరిగానే చాలామంది ఆంటీలు, కుర్రాళ్లు మోసపోయినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయం బయటికి పొక్కితే తమ పరువుపోతుందని ఎవరూ కంప్లైంట్ ఇవ్వడం లేదు. ఈ ఇలాంటి దందా హైదరాబాద్ తోపాటు దేశంలోని పలు నగరాల్లో తమ కార్యకలాపాలు చేస్తున్నట్లు తెల్సింది. ఇలాంటి మోసపూరిత ప్రకటనలపై యువకులు - మహిళలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.