Begin typing your search above and press return to search.
కీలక సామాజిక వర్గాన్ని బాబు వదిలేసుకున్నారే!
By: Tupaki Desk | 11 Aug 2021 4:30 PM GMTరాష్ట్ర రాజకీయాలు కొన్నేళ్లుగా సామాజిక వర్గాల వారీగానే నడుస్తున్న విషయం తెలిసిందే.కేవలం ఎన్నిక ల సమయంలోనే కాకుండా.. అన్ని దశల్లోనూ కొన్ని కీలక కులాలు.. పార్టీలను నడిపిస్తున్నాయి. ఈ క్రమం లోనే కాపు సామాజిక వర్గం పాత్ర కీలకంగా మారింది. 2019 ఎన్నికలకు ముందు. అదేసమయంలో 2014 ఎన్నికల కు ముందు కూడా కాపు సామాజిక వర్గం కేంద్రంగా రాష్ట్ర రాజకీయాలు నడిచాయి. ఈ క్రమంలో నే వారి డిమాండ్లు నెరవేరుస్తామంటూ.. పార్టీల అధినేతలు కూడా ప్రకటించారు.
దీంతో కాపులకు మరింత ప్రాధాన్యం ఏర్పడింది. గతంలోనూ ఈ సామాజిక వర్గానికి ప్రాధాన్యం ఉన్నప్ప టికీ.. ఇప్పుడు ఉన్నంత ప్రాధాన్యం మాత్రం లేదనే ఓ వాదన ఉంది. ఇదిలావుంటే.. కాపులను 2014లో తనవైపు తిప్పుకోవడంలోను, వారి ఓటు బ్యాంకును తనకు అనుకూలంగా మార్చుకోవడంలోనూ.. టీడీపీ అధినేత చంద్రబాబు సఫలమయ్యారు. ఈ క్రమంలోనే కాపు సామాజిక వర్గానికి చెందిన వారికి పదవులు ఇచ్చారు. కాపు కొర్పొరేషన్ ఏర్పాటు చేశారు. నిధులు కేటాయించారు.
అయినా.. 2019 ఎన్నికల నాటికి.. బాబు... కాపుల విశ్వాసం మాత్రం పొందలేక పోయారని అంటారు పరిశీలకులు. ఇదిలావుంటే, కాపు ఆశలపై ఒకింత ఉదాసీనంగా వ్యవహరించారనే పేరున్న వైసీపీ అధినేత ప్రస్తుత సీఎం జగన్.. మాత్రం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. కాపులకు గతంలో ఎన్నికలకు ముందు రిజ ర్వేషన్ ఇచ్చే అవకాశం లేదని కుండబద్దలు కొట్టిన జగన్‌కే కాపు సామాజిక వర్గం పట్టం కట్టడం.. ప్రతిపక్ష టీడీపీని సహా ఇతర పార్టీలను కూడా నివ్వెర పోయేలా చేసింది.
నిజానికి 2019 ఎన్నికలకు ముందు జరిగిన పరిణామంతో జగన్‌కు కాపులు దూరమవుతారని అనుకున్నా రు. దీనికి ఒకటి .. వారికి రిజర్వేషన్ ఇవ్వడం తన చేతుల్లోలేదని చేతులు ఎత్తేయడం. ఇదే సామాజిక వర్గానికి చెందిన యువ నేతకు అసెంబ్లీ టికెట్ ఇచ్చే విషయంలో పేచీ పెట్టడం వంటి పరిణామాలతో కాపుల ఆగ్రహానికి జగన్ గురవుతారని అనుకున్నారు. కానీ, అనూహ్యంగా ఆయన వారికి చేరువయ్యారు. దీంతో తర్వాత కాలంలో జగన్ కాపులను మచ్చిక చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు.
ఈ సామాజిక వర్గానికి మంత్రి పదవులు కేటాయించడంతోపాటు.. తాజాగా ప్రకటించిన నేతన్న నేస్తం పథకంలో ఏకంగా 2384 మంది కాపులకు ప్రయోజనం చేకూర్చారు. ఇదే సమయంలో టీడీపీ అధినేత చంద్రబాబు.. కాపులను ఒదిలేసుకుంటున్నారనే టాక్ వినిపిస్తోంది. మొత్తంగా చూస్తే.. బాబు పట్టుకుని వేలాడినా.. దక్కని ప్రయోజనం.. జగన్ వ్యూహంతో దక్కించుకుంటున్నారని అంటున్నారు పరిశీలకులు.