Begin typing your search above and press return to search.
సీఎం బర్త్ డే వేళ ఓపెన్ చేస్తారట
By: Tupaki Desk | 16 Jan 2023 1:30 PM GMTనచ్చినోళ్లను నెత్తిన పెట్టుకోవటం.. కాస్తంత తేడా కొట్టినా పాతాళానికి తొక్కేయటం ఎలా అన్న విషయం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు తెలిసినంత బాగా మరెవరికీ తెలీదనే చెప్పాలి. ఒక్క రాజకీయమే కాదు.. మరే విషయంలో అయినా ఆయన తీరు ఇలానే ఉంటుంది. ఆయనకు నచ్చకపోతే..
దేనినైనా సరే దాని అంతు చూసే వరకు వదిలిపెట్టని మొండితనం.. విమర్శల్ని పట్టించుకోని తీరు ఆయన సొంతం. ఉమ్మడి రాష్ట్రం నుంచి సెక్రటేరియ్ గా ఉన్న భవనం తనకు సూట్ కాదని డిసైడ్ అయిన కేసీఆర్.. తాను సీఎం అయినప్పటికి సెక్రటేరియట్ కు వెళ్లకుండా కొత్తగా నిర్మించిన తర్వాతే అందులో అడుగు పెట్టాలని డిసైడ్ కావటం తెలిసిందే.
ఇందులో భాగంగా భారీగా ఉన్న సెక్రటేరియట్ భవనాన్నిపూర్తిగా తీసేసి.. అందులో అత్యాధునిక వసతులతో భారీ ఎత్తున నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. వాస్తవానికి సెక్రటేరియట్ పనులు సంక్రాంతి నాటికి పూర్తి చేసి.. ఈ పెద్ద పండుగ వేళలో ఓపెన్ చేయాలని భావించారు. తాను కోరుకున్న రీతిలో సెక్రటేరియట్ ను పూర్తి చేయటానికి రూ.400 కోట్లతో మొదలు పెట్టి తాజాగా రూ.1200 కోట్ల ఖర్చు వరకు తీసుకొచ్చిన ఈ భారీ భవనాన్ని ప్రారంభించే డేట్ పై తాజాగా క్లారిటీ వచ్చింది.
తాము ఎంత ప్రయత్నించినా సంక్రాంతి పండక్కి సెక్రటేరియట్ పనులు పూర్తి చేయలేకపోయామని.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ పుట్టిన రోజైన ఫిబ్రవరి 17 నాటికి పూర్తి చేయటమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే పనుల వేగాన్ని పెంచిన అధికారులు.. సీఎం బర్త్ డే సందర్భంగా ఎట్టి పరిస్థితుల్లో ఓపెన్ అయ్యేలా కసరత్తు చేస్తున్నారు. కొత్త సెక్రటేరియట్ ను రూ.400 కోట్లతో మొదలు పెట్టి దాదాపు మూడు రెట్లు అధిక బడ్జెట్ తో దీన్ని పూర్తి చేస్తున్నారు.
ఓపెన్ బిడ్ లో పోటీ పడిన షాపూర్ జీ పల్లోంజీ తెలంగాణ కొత్త సెక్రటేరియట్ ను నిర్మించేందుకు అవకాశాన్నిసొంతం చేసుకోవటం తెలిసిందే. అయితే.. తొలుత అనుకున్నరూ.400 కోట్లకు దశల వారీగా పెంచుకుంటూ పోతూ చివరకురూ.1200 కోట్ల ఖర్చు వరకు తీసుకెళ్లారు. ఇదిలా ఉంటే.. సీఎం కేసీఆర్ బర్త్ డే వేళ ఈ భారీ భవనాన్ని ఓపెన్ చేయాలన్న కమిట్ మెంట్ ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా రాకుండా చూసుకోవాలన్న ఆలోచనలో అధికారులు ఉన్నట్లుగా చెబుతున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.