Begin typing your search above and press return to search.

మీరు నకిలీ.. నేను ఒరిజినల్‌ - కేసీఆర్‌

By:  Tupaki Desk   |   20 March 2019 5:44 AM GMT
మీరు నకిలీ.. నేను ఒరిజినల్‌ - కేసీఆర్‌
X
నిజామాబాద్‌ సభ సాక్షిగా బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు కేసీఆర్‌. హిందువులం అని చెప్పుకుంటున్న బీజేపీ నేతలు అసలు హిందువులే కాదని అన్నారు. నిజమైన హిందువులు ప్రతీ ఒక్కరినీ ప్రేమించి ఆదరిస్తారని.. కానీ బీజేపీ వాళ్లకు మాత్రం అవేం చేతకావని ఆరోపించారు. కేవలం రాజకీయాల కోసం హిందుత్వం అనే పదాన్ని వాళ్లు వాడుకుంటున్నారని విమర్శించారు. అన్నింటికి మించి రామజన్మభూమి విషయంలో బీజేపీ ఎక్కువ చేస్తుందని.. రామ జన్మభూమి అసలు ఎక్కడుందో తెలుసుకుని, దాన్ని రెచ్చగొట్టాల్సిన అవసరం ప్రధానికి ఏముందని దుయ్యబట్టారు.

"రామజన్మభూమి - రావణ జన్మభూమి - కృష్ణ జన్మభూమి ఎక్కడున్నాయో రాజకీయాల పార్టీలు డిసైడ్‌ చెయ్యాలి. అది అసలు వారి పనేనా. అసలు ఇది రాజకీయ పార్టీల పనికాదు. మనం చేయాల్సింది పేదవారికి సాయం చేయడం - రైతుల అన్నివేళలా కరెంట్ ఇవ్వడం - ప్రజల కష్టాలు తీర్చడం. కానీ బీజేపీ ఇవన్నీ వదిలేసి.. రామజన్మభూమి ఎక్కడుంది అని మాట్లాడుకుంటే ప్రజల సమస్యలు తీరవు. ఇక వాళ్లు తాము హిందువులం అంటారు. వాళ్లు హిందువులు అయితే మరి మనం ఎవ్వరం. మనం హిందువులం కాదా. మనం హిందూ సంప్రదాయాలు పాటించడం లేదు. మీవి పొలిటికల్‌ హిందుత్వం. మిగిలిన వారిది నిజమైన హిందుత్వం" అని బీజేపీపై చెలరేగిపోయారు కేసీఆర్‌.