Begin typing your search above and press return to search.

కరోనా గురించి ఆ విషయం తెలియకుంటే భవిష్యత్తులో మరింత ప్రమాదం

By:  Tupaki Desk   |   26 Jun 2021 3:30 PM GMT
కరోనా గురించి ఆ విషయం తెలియకుంటే భవిష్యత్తులో మరింత ప్రమాదం
X
కరోనా ప్రపంచం మొత్తంను ఏకతాటిపైకి తీసుకు వచ్చింది. మంచి చెడు అన్ని విషయాల గురించి చర్చించేలా చేసింది. కరోనా పుట్టుక గురించి ప్రతి ఒక్కరు కూడా ఇప్పుడు దృష్టి పెట్టాల్సిన సమయం వచ్చింది. ప్రపంచం మొత్తంను అయిదు పదేళ్ల వెనక్కు తీసుకు వెళ్లిన ఈ వైరస్‌ పుట్టుక గురించి తెలియకుంటే భవిష్యత్తులో మళ్లీ సమస్యలు తప్పక పోవచ్చు అంటూ నిపుణులు చెబుతున్నారు. ఏదైనా సమస్య మొదలు అయితే ఆ సమస్య పూర్వ పరాలను గుర్తించాలి... అలాగే ఆ సమస్య మళ్లీ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. కనుక సమస్య అనేది ఎక్క మొదలైంది అనేది తెలుసుకోవాలి. అలా తెలుసుకోవాలంటే లోతైన అద్యాయనం జరగాల్సి ఉంటుంది.

ప్రపంచ వ్యాప్తంగా ఎవరిని అడిగిన కరోనా చైనాలో పుట్టింది అనే సమాధానం చెబుతారు. అయితే అది ల్యాబ్‌ లో పుట్టిందా.. సహజంగా గబ్బిలాల ద్వారా వచ్చిందా అనే విషయమై మాత్రం ఎవరి వాదన వారిది. చైనా ఈ విషయంలో చేస్తున్న విరుద్ద ప్రకటనలు మరియు వారు దాస్తున్న కొన్ని విషయాలు మరింతగా అనుమానాలను కలిగిస్తున్నాయి. జీవాయుదం పేరుతో చైనా చాలా ఏళ్లుగా ప్రయోగాలు చేస్తుంది. ఆ ప్రయోగాల్లో భాగంగానే ఈ ప్రమాదకర కరోనా వ్యాక్సిన్‌ ను తయారు చేసి ఉంటుందనే అనుమానాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే అమెరికా అధ్యక్షుడు బైడెన్‌ కరోనా ఎక్కడ.. ఎలా పుట్టిందనే విషయాన్ని గుర్తించాలని ఆదేశించడంతో పాటు 90 రోజుల కాల పరిమితి కూడా విధించారు. కనుకా అతి త్వరలోనే అన్ని విషయాలు బయటకు వస్తాయని అంటున్నారు. చైనా ల్యాబ్‌ లో ఈ వైరస్ పుట్టిందని అమెరికాకు చెందిన కొందరు ప్రముఖులు బాహాటంగానే ఆరోపణలు చేస్తున్నారు. వారి ఆరోపణలను తీవ్రంగా ఖండించడంతో పాటు చైనా వారిపై చర్యలు కూడా తీసుకోవాలని డిమాండ్‌ చేస్తుంది.

కరోనా మూలాలు తెలియకుంటే రాబోయే రోజుల్లో మళ్లీ మళ్లీ ఇలాంటి పరిస్థితులు ఎదురయిన సందర్బంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను కనిపెట్టలేమని శాస్త్రవేత్తలు అంటున్నారు. కరోనా గబ్బిలాల నుండి వచ్చి ఉంటే వాటికి దూరం ఉండటంతో పాటు తక్షణ జాగ్రత్తలు తీసుకోవచ్చు. అలాగే ల్యాబ్‌ నుండి వైరస్ బయటకు వచ్చినట్లుగా నిరూపితం అయితే అందుకు తగ్గ చర్యలు చైనా పై తీసుకుని ముందు ముందు ఇలాంటి వ్యవహారాలు జరుగకుండా చూసుకోవచ్చు. అందుకే వైరస్ పుట్టుక గురించి ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు చెబుతున్నారు.